ప్రదీప్ హీరో ఏంటి? థియేటర్ కి ఎవడు వస్తారు అన్నారు.. ఇప్పుడు?

బుల్లితెరపై మంచి వ్యాఖ్యాతగా పేరు సంపాదించుకున్న ప్రదీప్” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా“? ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ప్రదీప్ ఇది వరకు ప్రముఖ హీరోల సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించారు.

 Director Munna Shocking Speech At 30 Rojullo Preminchadam Ela Success Meet, Dire-TeluguStop.com

ప్రస్తుతం బుల్లితెర యాంకర్ లలో మోస్ట్ వాంటెడ్ యాంకర్లలో ప్రతి కూడా ఒకరని చెప్పవచ్చు.ఇంత మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ ఈ సినిమాలో హీరోగా కనిపించారు.

ఈ సినిమాలో ” నీలి నీలి ఆకాశం “అనే పాట 300 మిలియన్ వ్యూస్ సాధించిందంటే అది ఒక సంచలనం అనే చెప్పవచ్చు.ఈ సినిమాకి మొత్తం ఈ పాట హైలెట్ గా నిలిచింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాకు హీరోగా ప్రదీప్ ఎంట్రీ ఇవ్వగా, దర్శకుడుగా మున్నా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.జనవరి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ తొలిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

ఈ సందర్భంగా చిత్ర బృందం కలిసి సక్సెస్ మీట్ నిర్వహించగా వేడుకలో సినిమా దర్శకుడు మున్నా మాట్లాడుతూ ఎంతో ఎమోషన్ అయ్యారు.

Telugu Munna, Pradeep, Speech-Movie

ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం అనే పాటను చూడటం కోసం ఎంతోమంది థియేటర్లకు వస్తున్నారు.ఈ సినిమా కథ అనుకున్నప్పుడు చాలా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, కానీ ఈ సినిమాలో ప్రదీప్ హీరో ఏంటి? అని ఎంతో మంది అడిగారు.ప్రతి రోజు టీవీ లలో కనిపించే ప్రదీప్ ని చూడటం కోసం థియేటర్లకు ఎవరో వస్తారని ఇండస్ట్రీలో చాలామంది తనను అడిగారని దర్శకుడు తెలియజేశారు.ఆరోజు వాళ్ళందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఈ రోజు ఈ సినిమా మొదటి రోజు 4.17 కోట్ల రూపాయల కలెక్షన్స్ సమాధానం అని చెప్పవచ్చు.

ఈరోజు ఈ సినిమాను చూడటానికి ఎంతో మంది థియేటర్ కి వస్తున్నారు.

ఒక చిన్న సినిమాను ఇంత మంది ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని.ఈ సినిమాలో తల్లి పాత్రలో హేమ క్యారెక్టర్ ఎంతగానో అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు.

కొత్త డైరెక్టర్ గా ఈ సినిమా ద్వారా పరిచయమైన మున్నా ఈ సినిమాకు దక్కిన విజయం ఎంతో మంది రాబోయే కొత్త దర్శకులకు, నటీనటులకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా కొంత ఎమోషనల్ అవుతూ మాట్లాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube