సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందని ఈ డైరెక్టర్ తెగ ఏడ్చాడట..?

ప్రదీప్ మాచిరాజు హీరోగా మున్నా (ఫణి ప్రదీప్) దర్శకత్వంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Director Munna Comments About 30 Rojullo Preminchadam Ela Movie,sudheer,munna,to-TeluguStop.com

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మున్నా మీడియాతో మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు చిన్నప్పటి నుంచి డైరెక్టర్ కావాలని ఉండేదని చెప్పారు.

Telugu Munna, Pradep, Software Job-Movie

అయితే తనకు సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందని ఉద్యోగం రావడంతో డైరెక్టర్ ను కావాలన్న కలకు దూరమయ్యానని తాను తెగ బాధ పడ్డానని తెలిపారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ఆర్య 2, 100 % లవ్, 1 నేనొక్కడినే సినిమాలకు రచయితల విభాగంలో తాను పని చేశానని 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కథను తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన సినిమాల స్పూర్తితో తాను రాశానని మున్నా తెలిపారు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయాలని కొన్ని కారణాల వల్ల చేయడం కుదరలేదని అన్నారు.నిర్మాత బన్నీ వాసు గారికి తాను 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కథ చెబితే ఆయన దగ్గరుండి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాయించానని అన్నారు.

తనకు రెండు పెద్ద బ్యానర్లలో ఛాన్స్ వచ్చిందని త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తానని మున్నా తెలిపారు.

తన కజిన్ ద్వారా ఈ సినిమా నిర్మాత ఎస్వీ బాబును కలిశానని ఆయనకు కథ నచ్చడంతో సినిమాను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.

అమ్మ, భార్య ఈ సినిమా కథ ప్రకారం హీరోగా ప్రదీప్ బాగుంటాడని సూచించారని నిర్మాతకు అదే విషయం చెప్పగా ఆయన అంగీకరించాడని మున్నా చెప్పుకొచ్చారు.రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube