గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ మారుతి...ఏం చేసాడంటే?

కరోనా ఎంతో మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.

 Director Maruti Who Has A Great Mind What Did He Do-TeluguStop.com

కరోనా మొదటి వేవ్ లో కరోనా కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం అంతగా నమోదు కాలేదు.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.

కరోనా బారిన సామాన్యులే కాదు సెలెబ్రెటీలు కూడా మరణిస్తున్న పరిస్థితి ఉంది.దీంతో ప్రజలందరూ మృత్యువు మన ముంగిట కదులుతున్నదనే చాలా మంది మానసికంగా బాధపడుతున్నారు.

 Director Maruti Who Has A Great Mind What Did He Do-గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ మారుతి…ఏం చేసాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే.

దీంతో వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న టీఎన్ఆర్ మృతి చెందడంతో వారి కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయంగా అందజేశారు.

తాజాగా డైరెక్టర్ మారుతి తన గొప్ప మనసు చాటుకున్నారు. టీఎన్ఆర్ కుటుంబానికి తన వంతు సహాయంగా యాభై వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు.

దీంతో ఇంతటి క్లిష్ట సమయంలో టీఎన్ఆర్ కుటుంబాన్ని  ఆదుకోవడానికి ముందుకురావడం సంతోషకరం.ఇప్పటికే చాలా మంది కూడా టీఎన్ఆర్ సతీమణికి తమ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూనే ఉన్నారు.

ఇప్పటికే ఐ డ్రీం ఛైర్మన్ పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

#Journalist Tnr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు