అయ్యో మారుతీ.. ఒక్క హీరో కూడా దొరకట్లేదా?

మారుతీ.ప్రముఖ దర్శకుడు.

 Director Maruthi, Prathiroju Pandage, Bhale Bhale Mogadivoi, Prema Katha Chitram-TeluguStop.com

ఒకానొక సమయంలో డిఫరెంట్ వే తో అందరిని ఆకట్టుకున్న దర్శకుడు మారుతీ.ఈ రోజుల్లో అంటూ రియల్ లైఫ్ లో అమ్మాయిలు అబ్బాయిల విషయంలో జరుగుతున్న సంగతిని చూపించి ఆహా అనిపించాడు.

ఆతర్వాత బస్సు స్టాప్ అంటూ అమ్మాయిలు తండ్రులను ఎలా మోసం చేస్తున్నారు.తల్లితండ్రులు పిల్లలపై ఎలాంటి ఊహలు పెట్టుకుంటారు.

వారి ప్రేమలు ఎలా ఉంటాయి అనేది కళ్లకు కట్టినట్టు చూపించి అందరిని అలరించాడు మారుతీ.ÑÈeT$T?

ఇక ఆ సమయంలో అన్ని ఇలాంటి సినిమాలే చేస్తాడు అంటూ అతనిపై రూమర్స్ వచ్చిన సమయంలో ప్రేమ కథ చిత్రం అంటూ సినెమా తీశారు.ఆ సినిమాను చూశారు అంటే ఎవరైనా సరే వామ్మో అని అనకుండా ఉండలేరు.ఆగకుండా నవ్వుతూనే ఉంటాం.ఒకవైపు భయం వేసిన మరవైపు పొట్టపగిలేలా నవ్వుతాం.ఇక ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్.

ఆతర్వాత నానితో కలిసి ఓ సినిమా తీశాడు.ఆ సినిమా సూపర్ హిట్.

అదే అండి.భలే భలే మొగాడివోయ్.

ఈ సినిమాలో చివరి వరకు నవ్వుతూనే ఉంటాం.మతిమరుపు పాత్రలో నటించిన నాని దర్శకత్వం వహించిన మారుతీ మంచి సూపర్ హిట్ ని అందుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత అలాంటి సినిమానే ఒకటి ఓసీడీ అంటూ మహానుభావుడు సినిమా తీసిన అది హిట్ అవ్వలేదు. కొత్త జంట సినిమా కూడా హిట్ అయ్యింది.

మధ్యలో కొన్ని సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చిన ఇటీవలే తీసిన ప్రతిరోజు పండగే సినిమా హిట్ అయ్యింది.

అలా చేసిన ప్రతి సినిమా హిట్ అయినా సరే ఎందుకో ఏ హీరోకి కథ వినిపించిన సెట్ అవ్వట్లేదట.

మంచి ఫార్మ్ లో ఉన్న వాళ్ళు ఒకే చెప్పలేదట.రీసెంట్ హిట్ కొట్టిన సరే అతడికి ఏ హీరో దొరకడం లేదని.

ఇంకొన్ని రోజులలో ఎవరు దొరకకపోతే అతనే కొత్త హీరోలను తీసుకొస్తాడు అని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.మరి హీరో దొరుకుతాడా? కొత్తవాళ్లు వస్తారా అనేది చూడాలి!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube