వెబ్ సిరీస్ లపై దృష్టిపెట్టిన మారుతి  

Director Maruthi Focus On Web Series For Aha - Telugu Digital Media,, Geetha Arts, Telugu Cinema, Tollywood

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది.సినిమాల నుంచి దర్శకులు కూడా ఈ వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు.

 Director Maruthi Focus On Web Series For Aha - Telugu Digital Media Geetha Arts Cinema Tollywood

డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్ లకి ప్రేక్షక ఆదరణ కూడా భాగానే ఉంది.దీంతో నేటి ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ నెట్ వర్క్ వంటి ఓటీటీ సంస్థలు నేరుగా అన్ని భాషలలో వెబ్ సిరీస్ లని నిర్మిస్తున్నారు.

ఈ మధ్య డిజిటల్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన అల్లు అరవింద్ కూడా ఆహా అనే ఓటీటీ చానల్ ని స్టార్ట్ చేశారు.ఇక ఇందులో వెబ్ సిరీస్ లని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

 Director Maruthi Focus On Web Series For Aha - Telugu Digital Media Geetha Arts Cinema Tollywood

దీనిపై ఫోకస్ పెట్టి కొత్త టాలెంట్ ని వినియోగించుకునే పనిలో పడ్డారు.

ఇప్పుడు ఈ ఓటీటీ కోసం గీతా ఆర్ట్స్ తో కలిసి పని చేయడానికి దర్శకుడు మారుతి రెడీ అయిపోయాడు.

తన దగ్గర ఉన్న టాలెంట్ అసిస్టెంట్ దర్శకుల కథలతో వెబ్ సిరీస్ లు ఆహా కోసం ప్లాన్ చేస్తున్నాడు.తన శిష్యులని అటువైపు తీసుకెళ్తున్నాడు.ప్ర‌స్తుతం కొంత‌మంది యువ ర‌చ‌యిత‌లు, యువ ద‌ర్శ‌కుల‌తో మారుతి మంత‌నాలు జ‌రుపుతున్నారు.క‌నీసం ఐదారు వెబ్ సిరీస్‌లు మారుతి నుంచి రాబోతున్నాయని తెలుస్తుంది.

తక్కువ బడ్జెట్ తో మంచి కంటెంట్ ని చెప్పగలిగే విధంగా ఈ వెబ్ సిరీస్ లని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఇవి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు

Director Maruthi Focus On Web Series For Aha Related Telugu News,Photos/Pics,Images..