బన్నీతో అలాంటి సినిమా చేయాలనుందట.. ఒప్పుకుంటాడా ?

టాలీవుడ్ లో డైరెక్టర్ మారుతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎక్కువుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించే మారుతి వరుస సినిమాలతో తీస్తూ విజయాలు అందుకుంటూ మంచి జోష్ లో ఉన్నాడు.

 Director Maruthi Comments On Allu Arjun About New Movie-TeluguStop.com

మారుతి సినిమాలంటే కామెడీ పక్కాగా ఉంటుంది.ప్రస్తుతం మారుతి ‘మంచి రోజులొచ్చాయి‘ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.తాజాగా మారుతి ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు.ఇంటర్వ్యూ లో మారుతి ని అల్లు అర్జున్ తో మీరు సినిమా తీయాలంటే ఎలాంటి సినిమా తీస్తారని అడిగారు.అందుకు మారుతి అల్లు అర్జున్ తో అల్లాఉద్దీన్ లాంటి యానిమేషన్ సినిమా చేస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు.

 Director Maruthi Comments On Allu Arjun About New Movie-బన్నీతో అలాంటి సినిమా చేయాలనుందట.. ఒప్పుకుంటాడా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మారుతి, అల్లు అర్జున్ మంచి స్నేహితులని తెలిసిందే.వీరిద్దరికి యానిమేషన్ సినిమాలు అంటే ఇష్టమని అందుకే ఎప్పటి నుండో అలాంటి సినిమా చేయాలనీ ఉందని మారుతీ తెలిపారు.

కానీ అల్లు అర్జున్ లాంటి మాస్ హీరో యానిమేషన్ సినిమాలో చేస్తే ఎంత వరకు క్లిక్ అవుతుందనేది ఇప్పుడు అభిమానులు చర్చించు కుంటున్నారు.అలాగే అల్లు అర్జున్ కూడా ఇలాంటి సినిమాకు ఆసక్తి చూపిస్తారో లేదో తెలియాలి.

Telugu Aladdin Animation Movie, Allu Arjun, Maruthi, Maruthi Allauddin Animation Movie With Allu Arjun, Pushpa, Rashmika Mandanna, Sukumar-Movie

ప్రస్తుతం అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈయనకు జోడీగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Telugu Aladdin Animation Movie, Allu Arjun, Maruthi, Maruthi Allauddin Animation Movie With Allu Arjun, Pushpa, Rashmika Mandanna, Sukumar-Movie

ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.మొదటి భాగం ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకుంది.మిగతా భాగం కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సంవత్సరమే మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు టాక్.

#Allu Arjun #Aladdin #Maruthi #Pushpa #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు