డైరెక్టర్ మణిరత్నం కు గుండెపోటు...అపోలో కి తరలింపు  

Director Mani Ratnam Joined In Hospital-

డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఆ చిత్రాలు చూస్తే ఎవరైనా ఆయన సినిమాలకు ఫిదా అవ్వాల్సిందే.అయితే ఈ రోజు మణిరత్నం కు హఠాత్తుగా గుండె పోటుకు గురికావడం తో ఆయనను కొద్దీ సేపటి క్రితం అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Director Mani Ratnam Joined In Hospital--Director Mani Ratnam Joined In Hospital-

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కు ఈ విధంగా గుండె నొప్పి రావడం ఇది మూడోసారి.గతంలో 2004 యువ సినిమా సమయంలో ఆయన తొలిసారి గుండెపోటుకు గురవ్వగా, 2015 లో రెండోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.అయితే నార్మల్ చెకప్ కోసం అని జాయిన్ అయినట్లు తెలుస్తుంది.అయితే 2018 లో కూడా మణిరత్నం కు గుండె పోటు వచ్చి ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి.

అయితే అప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా ఆయన ఆసుపత్రి నుంచి బయటపడ్డారు.అయితే ఇప్పుడు తాజాగా మూడో సారి ఆయన గుండెపోటుకు గురికావడం తో మరోసారి అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ప్రస్తు.తం మణిరత్నం ఎలాంటి ప్రాజెక్టు లు చేస్తున్నట్లు కనిపించడం లేదు.2018 లో ఆయనకు గుండె పోటు వచ్చిన తరువాత ప్రస్తుతం ఆయన రెస్ట్ లోనే ఉంటున్నట్లు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.