వెంకటేష్ తో సినిమా అని 6 నెలలకు సురేష్ బాబు హ్యాండ్ ఇచ్చాడు: డైరెక్టర్

Director Mahesh Chandra Says Suresh Babu Cheated By Saying Movie With Venkatesh

చిరంజీవి గారు తన కోసం ఒక కథ రెడీ చేయమని అడిగితే తాను ఆ పనిలో ఉండగానే సురేష్‌ గారు పిలిచి, వెంకటేశ్‌తో సినిమా తీయడానికి ఒక కథ తయారు చేయమని అడిగినట్టు ప్రముఖ దర్శకుడు మహేశ్ చంద్ర అన్నారు.అప్పుడు వెంటనే తాను చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి తనకు లైఫ్ ఇచ్చిన సంస్థ, ఫుడ్ పెట్టిన సంస్థ కోరిక మేరకు వెంకటేష్తో సినిమా చేస్తానని, అది అయిపోయాక వెంటనే మళ్లీ మనది స్టార్ట్ చేస్తానని చెప్పడంతో ఆయన కూడా ఓకే చెప్పారని మహేశ్ వివరించారు.

 Director Mahesh Chandra Says Suresh Babu Cheated By Saying Movie With Venkatesh-TeluguStop.com

ఆ తర్వాత సురేశ్‌ బాబు తనకు కొన్ని సినిమాలిచ్చి వీటితో ఒక మంచి కథ రెడీ చెయ్యమని అన్నట్టు మహేశ్ తెలిపారు.బొబ్బిలి రాజాలాగా ఉండాలి, ప్రేయసి రావేలాగా సెంటిమెంట్ ఉండాలి.

సినిమా అన్ని జానర్స్ లో ఉండాలని తనకు సురేశ్ బాబు చెప్పినట్టు ఆయన తెలిపారు.వెంటనే పోసాని గారిని పిలిపించుకొని కథ రాయడం మొదలు పెట్టానని ఆయన అన్నారు.

 Director Mahesh Chandra Says Suresh Babu Cheated By Saying Movie With Venkatesh-వెంకటేష్ తో సినిమా అని 6 నెలలకు సురేష్ బాబు హ్యాండ్ ఇచ్చాడు: డైరెక్టర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాస్తున్నాను కానీ ఫస్ట్ ఆఫ్ నచ్చితే సెకండ్ ఆఫ్ నచ్చకపోవడం ఇలాంటివన్నీ జరిగాయని అలా చాలా రోజులు సాగిందని ఆయన అన్నారు.కానీ తన సినిమా మాత్రం వెంకటేష్తోనే అన్న విషయం మాత్రం అందరికీ తెలిసిపోయిందని, తను కూడా అదే డిసైడ్ అయ్యానని ఆయన తెలిపారు.

అలా జరుగుతున్న సమయంలోనే జయం మనదేరా సినిమా వెలుగులోకి వచ్చిందని మహేశ్ అన్నారు.

Telugu Chandra Mahesh, Chiranjeevi, Mahesh Chandra, Srihari, Jayam Manadera, Venkatesh, Suresh Babu, Tollywood-Movie

అది విన్న తాను వెంటనే సురేశ్‌ బాబును అడిగితే అదేం లేదు ఈ కథంతా లండన్‌లో తీస్తున్నాం.థమ్సప్ యాడ్ కోసం వాళ్లు పంపిస్తారు.వాళ్లు దానికి దాదాపుగా 80 లక్షలు ఇస్తారు.

దాంతోసినిమా కూడా అయిపోతుందని అన్నట్టు ఆయన చెప్పారు.ఆ తర్వాత మళ్లీ చేద్దామని అన్నట్టు కూడా చెప్పడంతో అక్కడ సీన్ తనకు అర్థమైందని మహేశ్ అన్నారు.

Telugu Chandra Mahesh, Chiranjeevi, Mahesh Chandra, Srihari, Jayam Manadera, Venkatesh, Suresh Babu, Tollywood-Movie

అంటే మళ్లీ ఆ టైమ్ వచ్చేసరికి చాలా సమయం పడుతుందని తనకు తెలిసిపోయిందని ఆయన అన్నారు.అప్పుడు ఏ హీరో దగ్గరికెళ్లినా ఏదో కారణంతో తన కథను చెయ్యడానికి ఒప్పుకోలేదని, అలాంటి సమయంలో హీరో శ్రీహరి వచ్చి తనతో సినిమా చేయమని చెప్పడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

#Venkatesh #Srihari #Chandra Mahesh #Jayam Manadera #Mahesh Chandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube