టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prashant Verma ) తాజాగా దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్( Hanuman ).ఇందులో తేజా సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే.
సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది.రియల్ సూపర్ హీరో అయిన ఆంజనేయ స్వామి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చింది.
దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలోనే లభించింది.ఫలితంగా ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ కూడా లభించాయి.

దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.కాగా తక్కువ బడ్జెట్‌తోనే వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ మూవీపై తాజాగా ఒక నెటిజన్ విభిన్నంగా స్పందించాడు.ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఎందుకో తెలీదు.నాకు హనుమాన్ మూవీ కంటే శ్రీ ఆంజనేయం( Sri Anjaneyam ) సినిమానే నచ్చింది.శ్రీ ఆంజనేయం సూపర్ సినిమా.పిచ్చి నా కొడుకులకు అర్థం కాలేదు అని రాసుకొచ్చాడు.
కాగా సదరు నెటిజన్ చేసిన ట్వీట్‌పై ‘శ్రీ ఆంజనేయం’ మూవీ దర్శకుడు కృష్ణ వంశీ( Krishna Vamsi ) స్పందించారు.ఈ మేరకు అతడికి సమాధానంగా.
ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయరు.

వాళ్లకు నచ్చకపోవడం అంటే సినిమా వాళ్లకు చేరడంలో సమస్య ఉండి ఉండవచ్చు.కాబట్టి ప్రేక్షకులను నిందించకండి.అలాగే, నేను కొన్నింటిలో తప్పు చేసి ఉండవచ్చు.
థ్యాంక్యూ.గాడ్ బ్లెస్ అని తెలిపారు.
అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా కొందరు ప్రేక్షకులు శ్రీ ఆంజనేయం సినిమా బాగుంది అంటూ ఆ సినిమాకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు హనుమాన్ సినిమా బాగుంది అంటూ మద్దతు తెలుపుతున్నారు.