సీరియల్స్ నుంచి వెబ్ సిరీస్ వైపు షిఫ్ట్ అయిన దర్శకుడు క్రిష్  

వెబ్ సిరిస్ కి ప్లాన్ చేస్తున్న దర్శకుడు క్రిష్. .

Director Krish Wrote Script For Web Series-

టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తి జాగర్లమూడి క్రిష్.ఇప్పటి వరకు కెరీర్లో చేసిన సినిమాలు తక్కువే అయిన ప్రతి సినిమాలో కూడా తనదైన మార్కు చూపించి రచయితగా, దర్శకుడిగా తనకంటూ గుర్తింపు క్రియేట్ చేసుకున్నారు.

Director Krish Wrote Script For Web Series--Director Krish Wrote Script For Web Series-

ఇదిలా ఉంటే గత ఏడాది క్రిష్ కెరియర్లో ఎన్టీఆర్ రూపంలో భారీ డిజాస్టర్ వచ్చి చేరింది.అదే టైమ్ లో బాలీవుడ్ లో తెరకెక్కిన మణికర్ణిక సినిమా విషయంలో హీరోయిన్ కంగనా రనౌత్ గొడవలు క్రిష్ ఇమేజ్ ని దెబ్బతీసాయి.

దాంతో కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న దర్శకుడు క్రిష్ మరల తన రీ ఎంట్రీ ని ఘనంగా చాటే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే ప్రయత్నంలో మరలా బాలీవుడ్ సినిమాతోనే హిట్ కొట్టాలని కసితో ఉన్న దర్శకుడు క్రిష్ ఆ ప్రయత్నంలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు అని తెలుస్తుంది.

అక్షయ్ కుమార్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే మరోవైపు తన సొంత బ్యానర్ లో ఇప్పటి వరకు సీరియల్స్ కి కథలు అందిస్తూ నిర్మిస్తూ వస్తున్న క్రిష్ ఇప్పుడు వెబ్ సిరిస్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.ఒక వెబ్ సిరిస్ కి సంబంధించి ఫుల్ స్క్రిప్ట్ క్రిష్ సిద్ధం చేసి తన సొంత బ్యానర్ లో నిర్మించడానికి రెడీ అయినట్లు సమాచారం.

మరి ఈ టాలెంటెడ్ దర్శకుడు దీనికి కథ-స్క్రీన్ ప్లే మాత్రమే అందిస్తారా లేదంటే దర్శకత్వం కూడా చేస్తారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.