మెగాస్టార్ ని ఖబడ్దార్ అనడంపై స్పందించిన క్రిష్   Director Krish Responds On “Warning” To Mega Family     2016-12-27   22:11:39  IST  Raghu V

మొన్న జరిగిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ అందరు చూసే ఉంటారు. మొత్తం ఫంక్షన్ ఒకవైపు, దర్శకుడు క్రిష్ ఇచ్చిన ప్రసంగం మరోవైపు. అవేశం, ఆలోచన కలిగలిసిన ఈ స్పీచ్ వాడివేడి చర్చలకు దారితీసింది. అందుకు కారణం, క్రిష్ తన ప్రసంగాన్ని “సంక్రాంతికి వస్తున్నాం .. ఖబడ్దార్” అని ముగించడమే.

సంక్రాంతికి తన సినిమాకి పోటిగా వచ్చేది మెగాస్టార్ చిరంజీవే కావడంతో, బాలకృష్ణ బాక్సాఫీస్ పోటిని దృష్టిలో పెట్టుకోనే, మెగా ఫ్యామిలికే క్రిష్ వార్నింగ్ ఇచ్చాడని మీడియా కబుర్లు పెట్టింది. దాంతో క్రిష్ స్పందించాల్సి వచ్చింది.

“ఖబడ్దార్” అనే పదం తాను చిరంజీవిని ఉద్దేశించి కాని, సంక్రాంతి బాక్సాఫీస్ పోరు గురించి కాని అనలేదని, తెలుగు జాతిని తక్కువగా చూసేవారికి గౌతమీపుత్ర శాతకర్ణి ఓ సమాధానమని, తెలుగు జాతిని గౌరవించని వారిని దృష్టిలో పెట్టుకోని ఆ పదం వాడనని చెప్పాడు.

అల్లు అర్జున్ తో వేదం చేసి, వరుణ్ తేజ్ తో కంచే తీసి, చరణ్ తో స్నేహం, చిరంజీవి పట్ల గౌరవం కలిగిన తాను మెగా ఫ్యామిలి గురించి అలా ఎందుకు మాట్లాడతానని, దీనికి విపరీతార్థాలు తీయవద్దని క్రిష్ చెప్పుకొచ్చారు.