క్రిష్‌ కూడా నమ్మలేనంత పారితోషికం ఇచ్చిన బాలయ్య...     2019-01-04   10:35:59  IST  Sai Mallula

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషింగా ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతున్న ఈ చిత్రంకు వంద కోట్లకు పైగా బిజినెస్‌ అయ్యింది. ఇప్పటి వరకు బాలయ్య నటించిన సినిమాల్లోకెళ్లా ఇదే అత్యధిక బిజినెస్‌ను సాధించింది. బాలయ్య ఈ చిత్రానికి నిర్మాత కూడా అవ్వడంతో కోట్ల రూపాయలను బాలయ్య తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంకు ఇంత క్రేజ్‌ రావడంకు ప్రధాన కారణం క్రిష్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Director Krish Remuneration For NTR Biopic Movie-Director Director Laxmi Parvathi Laxmis Ntr Nadendla Bhaskar Rao Ntr Movie Vidhya Balan Telugu

Director Krish Remuneration For NTR Biopic Movie

క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ చిత్రం తెరకెక్కిన కారణంగానే ఈ స్థాయిలో క్రేజ్‌ వచ్చింది. అదే తేజ దర్శకత్వంలో ఈ సినిమా రూపొంది ఉంటే ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోనేవారు కాదు అంటూ అంతా అంటున్నారు. క్రిష్‌ ఈ సినిమాకు ఇంతటి క్రేజ్‌ తీసుకు వచ్చిన కారణంగా బాలయ్య భారీ పారితోషికం ముట్ట జెప్పినట్లుగా తెలుస్తోంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంకు గాను క్రిష్‌ కేవలం నాలుగున్నర కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నాడు.

Director Krish Remuneration For NTR Biopic Movie-Director Director Laxmi Parvathi Laxmis Ntr Nadendla Bhaskar Rao Ntr Movie Vidhya Balan Telugu

ఇక బాలీవుడ్‌లో మణికర్ణిక చిత్రానికి అయిదు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్‌ వచ్చింది. కాని ఎన్టీఆర్‌ చిత్రానికి మాత్రం ఏకంగా 11 కోట్ల రూపాయలను బాలయ్య ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Director Krish Remuneration For NTR Biopic Movie-Director Director Laxmi Parvathi Laxmis Ntr Nadendla Bhaskar Rao Ntr Movie Vidhya Balan Telugu

ఏడున్నర కోట్ల రూపాయలను క్రిష్‌ ఆశించాడని, కాని బాలయ్య ‘ఎన్టీఆర్‌’ సినిమాకు వచ్చిన బిజినెస్‌ కారణంగా క్రిష్‌ ఊహించిన దానికంటే ఎక్కువగా అంటే 11 కోట్ల రూపాయలు ఇచ్చి క్రిష్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. రెండు పార్ట్‌లు సక్సెస్‌ అయితే క్రిష్‌ మరో నాలుగు అయిదు కోట్లు కూడా ముట్టజెప్పే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో 10 కోట్లకు మించి పారితోషికం తీసుకునే దర్శకులు అతి కొద్ది మంది మాత్రమే. వారిలో క్రిష్‌ కూడా ఇప్పుడు చేరాడు.