తేజా కావాలన్నాడు, క్రిష్‌కు అక్కర్లేదనుకుంటా!     2018-06-12   00:44:16  IST  Raghu V

నందమూరి ఫ్యామిలీ మద్య విభేదాలు ఉన్నట్లుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. అది నిజమే అని పలు సందర్బాల్లో వెళ్లడి అయ్యింది. ముఖ్యంగా ఎన్టీఆర్‌, బాలకృష్ణల మద్య మచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. బాలకృష్ణ కావాలని ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచుతున్నాడు అంటూ నందమూరి అభిమానులు మరియు రాజకీయ నాయకులు చెబుతున్నారు. వీరిద్దరి మద్య ఉన్న విభేదాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరాయి. ఎన్టీఆర్‌ను కనీసం చూసేందుకు కూడా బాలయ్య ఇష్ట పడటం లేదు అనే టాక్‌ సినీ వర్గాల్లో ఉంది. మరో వైపు ఎన్టీఆర్‌కు అన్న కళ్యాణ్‌ రామ్‌ మరియు తండ్రి హరికృష్ణలు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇలాంటి సమయంలో బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ నటించాలని ఆశ పడుతున్నాడు. కాని ఆ ఆశ నెరవేరేలా లేదు. మొదట ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తేజ దర్శకత్వంలో చేయాలని బాలకృష్ణ భావించాడు. తేజ దాదాపు మూడు నెలల పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చేశాడు. కాని ఏమైందో ఆయన సినిమా నుండి వెళ్లి పోయాడు. తేజ స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న సమయంలో రెండు సార్లు కళ్యాణ్‌ రామ్‌తో ఒక పాత్రను చేయాల్సిందిగా కోరడం జరిగింది.