చివరికి ఆ హీరోకి ఫిక్స్ అయిన క్రిష్! కంగనాకి అలా షాక్ ఇస్తాడా  

అక్షయ్ కుమార్ తో మూవీ ప్లాన్ చేస్తున్న క్రిష్. .

Director Krish Plan To Movie In Bollywood With Akshay Kumar-bollywood,director Krish Plan To Movie In Bollywood,telugu Cinema,tollywood

టాలీవుడ్ లో క్రియేటివ్ దర్శకుడుగా, కథనంలోనే హీరోయిజం చూపిస్తూ, రెగ్యులర్ దర్శకులకి భిన్నమైన కథలతో సత్తా చాటిన వ్యక్తి క్రిష్. ఇక క్రిష్ కెరియర్ లో అన్ని కూడా గుర్తుండిపోయే సినిమాలే ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ దర్శకుడు బాలీవుడ్ లో అడుగు పెట్టి ఠాగూర్ సినిమా రీమేక్ చేసి పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాడు..

చివరికి ఆ హీరోకి ఫిక్స్ అయిన క్రిష్! కంగనాకి అలా షాక్ ఇస్తాడా-Director Krish Plan To Movie In Bollywood With Akshay Kumar

తర్వాత కంగనా రనౌత్ తో మణికర్ణిక సినిమా తెరకెక్కించే అవకాశం వచ్చింది. ఇక అక్కడి నుంచి అతన్ని దురదృష్టం వెంటాడింది. ఈ సినిమా షూటింగ్ టైంలో కంగనాతో చెడిపోవడంతో మధ్యలోనే సినిమా వదిలేసాడు.

ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ ని తెరకెక్కించడంపై ద్రుష్టి పెట్టాడు. అయితే ఈ బయోపిక్ సిరిస్ డిజాస్టర్ కావడంతో అతనికి ఊహించని పరాభవం ఎదురైంది. దీంతో మళ్ళీ ఎలా అయిన తనని తాను నిరూపించుకోవాలి అని ఎదురుచూస్తున్న క్రిష్ తెలుగు సినిమాతో కాకుండా హిందీ సినిమాపై ద్రుష్టి పెట్టాడు.

ఇక అతనికి బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మళ్ళీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని అక్షయ్ కుమార్ తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఖిలాడీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.