క్రిష్ ని కదిలించిన కొండపొలం నవల్... ఆ సినిమా వెనుక అసలు కథ

మంచి విషయం ఉన్న దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి క్రిష్ జాగర్లమూడి.మొదటి సినిమా గమ్యం నుంచి ఇప్పుడు చేసిన కొండపొలం సినిమా వరకు ప్రతి సినిమాలో కథనే హీరోగా ప్రెజెంట్ చేస్తూ సినిమాలు తెరకెక్కించారు.

 Director Krish Opens Up About Kondapolam Movie, Tollywood, Vaishnav Tej, Rakul P-TeluguStop.com

మధ్యలో ఎన్ఠీఆర్ బయోపిక్ తో కొంత విమర్శలపాలైన మళ్ళీ ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హిస్టారికల్ నేపధ్యం ఉన్న కథాంశంతో సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు.ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఈ లోపే తానా బహుమతి గెలుచుకున్న ఒక నవల ని క్రిష్ సినిమాగా మార్చి తెరకెక్కించారు.వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ కి క్రిష్ కేవలం 45 రోజుల్లో పూర్తి చేసేశాడు.

ఇక ఈ సినిమాని ఓటీటీ కోసం క్రిష్ తెరకెక్కించినట్లు ప్రచారం జరిగింది.అయితే దీనిని థియేటర్ లో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు క్రిష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

లాక్‌డౌన్ టైమ్‌లో చదివిన కొండపొలం అనే పుస్తకం నన్ను బాగా కదిలించింది.

వెంటనే సినిమాగా తీసేయాలనిపించింది.వెంటనే ఆ నవల హక్కులు తీసుకోమని నా పార్ట్‌నర్‌కు చెప్పాను.

రెండు మూడేళ్ల తర్వాత ఈ సినిమా చేయాలనుకున్నాను.అయితే తన సినిమా కంటే ముందు మరో సినిమా చేసుకొమ్మని పవన్ సూచించారు.

దీంతో వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టాను.ఇక సినిమా మొదలు పెట్టి మొత్తం ఫారెస్ట్ నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం జరిగింది.

ఇక ఇందులో ఓబులమ్మ అనే డీగ్లామర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఒదిగిపోయిందని తెలిపారు.ఇక ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇక సినిమాకి కూడా కొండపొలం అనే టైటిల్ నే క్రిష్ ఫిక్స్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube