క్రిష్ తీసుకున్న డేరింగ్ నిర్ణయం... మిగిలిన చిత్రాలకి రూట్ మ్యాప్

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ అన్ని కూడా బంద్ అయిపోయాయి.మళ్ళీ స్టార్ట్ చేయాలన్న ఎవరికీ కరోనా వచ్చి అది షూటింగ్ మీద ప్రభావం చూపిస్తుందో అని స్టార్ హీరోల నుంచి నిర్మాతల వరకు అందరూ భయపడుతున్నారు.

 Director Krish Non-stop Shooting Plan, Tollywood, Vaishnav Tej, Rakul Preet Sing-TeluguStop.com

ప్రభుత్వం షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన కూడా కరోనాపై అప్రమత్తంగా ఉండటానికి కొన్ని నిబంధనలు పెట్టింది.వాటిని కచ్చితంగా పాటించాలని సూచించింది.

అయితే ఈ నిబంధనలు ఫాలో అవుతూ షూటింగ్ చేయడం కష్టమైన విషయం అంటూ కొంతమంది నిర్మాతలు చేతులెత్తేస్తున్నారు.అయితే ఇలాంటి సమయంలో దర్శకుడు క్రిష్ అందరికి ధైర్యం ఇచ్చే విధంగా తన కొత్త సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు.వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్ లో మొదలు పెట్టారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ని సింగిల్ షెడ్యుల్ లో ఏకంగా 45 రోజుల పాటు గ్యాప్ లేకుండా చేసి పూర్తి చేయనున్నాడు.తాజాగా షూటింగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా జాయిన్ అయ్యింది.

ఈ షూటింగ్ పూర్తయ్యేంత వరకు సినిమా కోసం పని చేసే కాస్ట్ అండ్ క్రూ పూర్తిగా లొకేషన్ లోనే ఉండాల్సి ఉంటుంది.షూటింగ్ లో పాల్గొనే వారు బయటకి వెళ్ళడం అనేది పూర్తిగా ఆపేసి, అత్యవసరం అయితే తప్ప బయటి నుంచి కూడా షూటింగ్ లో పాల్గొనడానికి ఎవరిని అనుమతించే పరిస్థితి ఉండదు.

సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కాస్ట్ అండ్ క్రూ మొత్తం లొకేషన్స్ నుంచి బయటకి వెళ్తారు.ఇలా చేయడం వలన కరోనా ప్రమాదం లేకుండా షూటింగ్ పూర్తి చేసుకోవచ్చని భావిస్తున్నారు.

క్రిష్ అమలు చేస్తున్న ఈ నిర్ణయం వర్క్ అవుట్ అయితే అది మిగిలిన సినిమా షూటింగ్ లకి కూడా మార్గదర్శకం అవుతుంది.అయితే భారీ బడ్జెట్ సినిమాలకి ఇది కొంచెం కష్టం కావచ్చు.

మరి క్రిష్ రూట్ లోకి ఇప్పుడు ఎంత మంది దర్శక, నిర్మాతలు వచ్చి సింగిల్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటారు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube