ఎన్టీఆర్‌కు ఉన్న పిచ్చే క్రిష్‌ కు కూడా.. దానికి 9 లక్షలు ఖర్చు చేశాడట

సెలబ్రెటీలు కోట్లు ఖర్చు పెట్టి కార్లు కొనడంతో పాటు లక్షలు పెట్టి నెంబర్‌ లు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు.గతంలో పలువురు సెలబ్రెటీలు భారీ మొత్తంలో ఖర్చు చేసి నెంబర్‌లు కొనుగోలు చేయడం మనం చూశాం.

 Director Krish Have 9 Number Sentiment Like Ntr-TeluguStop.com

ముఖ్యంగా తెలుగు హీరో ఎన్టీఆర్‌ గతంలో తన పలు కార్లకు అన్ని 9 లు వచ్చే నెంబర్‌ కోసం చాలా ప్రయత్నాలు చేయడంతో పాటు, భారీగా ఖర్చు చేసిన విషయం తెల్సిందే.ఎన్టీఆర్‌కు ఈ 9 పిచ్చి ఏంట్రా బాబోయ్‌ అనుకున్నారు కొందరు.

కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు 9 అంటే ఎంతో మందికి కూడా అభిమానం ఉంటుంది.తాజాగా క్రిష్‌ కూడా 9 తీసుకున్నాడు.

దర్శకుడు క్రిష్‌ తాజాగా 9999 నెంబర్‌ను ఖైరతాబాద్‌ ఆర్‌టీఎ ఆఫీస్‌లో తీసుకున్నాడు.వేళంలో ఈ నెంబర్‌ను ఏకంగా 9 లక్షలకు ఆయన కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.ఫ్యాన్సీ నెంబర్‌ అయిన 9999కి భారీ డిమాండ్‌ ఉంటుంది.అందుకే ఆ నెంబర్‌ కోసం క్రిష్‌ చాలా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.9 నెంబర్‌ కోసం 9 లక్షలను ఖర్చు చేయడం కాస్త చిత్రంగా అనిపిస్తుంది.క్రిష్‌ ఖర్చు విషయంలో కూడా సెంటిమెంట్‌తో 9 పెట్టాడా లేదంటే అలా జరిగిపోయిందా అనేది మాత్రం తెలియదు.

జాతకాలు, సెంటిమెంట్స్‌ ఎక్కువగా నమ్మే వారు మాత్రమే ఇలా 9999 నెంబర్‌ కావాలని కోరుకుంటారు.ఈలెక్కన చూస్తుంటే ఎన్టీఆర్‌కు ఉన్నట్లుగానే క్రిష్‌కు కూడా ఆ పిచ్చి బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది.ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రెటీలు అంతా కూడా ఫ్యాన్సీ నెంబర్‌లనే వాడేందుకు ఆసక్తి చూపుతారు.ఇక క్రిష్‌ తాజాగా కొనుగోలు చేసిన ఖరీరు 1.35 కోట్లు అంటూ సమాచారం అందుతోంది.అంత ఖర్చు పెట్టినప్పుడు కేవలం 9 లక్షలు పెట్టి నెంబర్‌ తీసుకోలేడా చెప్పండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube