క్రిష్‌ కాపురం కూల్చిన హీరోయిన్‌       2018-05-31   20:15:28  IST  Raghu V

టాలీవుడ్‌లో విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రిష్‌ బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్‌ను సంపాదించాడు. అక్కడ చేసినవి రెండే సినిమాలు అయినా కూడా పలువురు స్టార్‌ హీరోల అభిమానంను చూరగొన్నాడు. తెలుగులో తాజాగా ఈయన ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి సైన్‌ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. విభిన్న కథాంశాలతో సినిమాలను తీయడంలో దిట్టగా పేరున్న క్రిష్‌ వ్యక్తిగత విషయం కారణంగా మీడియాలో వార్త వస్తువు అయ్యాడు. తాజాగా ఈయన తన భార్య రమ్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. విడాకుల కోసం ఇప్పటికే ఫ్యామిలీ కోర్టుకు ధరఖాస్తు కూడా చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

2016 ఆగస్టులో క్రిష్‌, రమ్యల వివాహం జరిగింది. వీరిద్దరు మూడు సంవత్సరాలు ప్రేమించుకున్నారని, పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దం అయ్యారు అంటూ అప్పుడు ప్రచారం జరిగింది. డాక్టర్‌ అయిన రమ్య సినిమాలంటే ఇష్టం లేకున్నా కూడా దర్శకుడు క్రిష్‌పై ప్రేమతో వివాహంకు సిద్దం అయ్యింది. వీరి వివాహం అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్‌గా సినిమా ప్రముఖుల సమక్షంలో జరిగింది. వివాహం జరిగిన కొన్నాళ్లకే వీరి మద్య మనస్ఫర్థలు వచ్చాయట. ఆ మనస్ఫర్ధలు కాస్త పెరిగి పెద్దవి అవ్వడంతో చివరకు విడాకుల వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇక వీరి విడాకులకు ఒక కారణం హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ అనే పుకార్లు సినీ వర్గాల్లో షికారు చేస్తున్నాయి. ‘కంచె’ చిత్రంతో ప్రగ్యాను తెలుగు ప్రేక్షకులకు క్రిష్‌ పరిచయం చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రగ్యాకు మంచి ఆఫర్స్‌ వచ్చాయి. తెలుగులో ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్న ప్రగ్యా జైస్వాల్‌తో క్రిష్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని ఆ మద్య ప్రచారం జరిగింది. తాజాగా రమ్యతో క్రిష్‌ విడాకుల నేపథ్యంలో అప్పట్లో జరిగిన ప్రచారం నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

-

క్రిష్‌కు ప్రగ్యాకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో కుప్పలు తెప్పలుగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కలిసి డిన్నర్‌లకు వెళ్లడం, హోటల్స్‌లో కనిపించేవారని, ఏదైనా సినిమా కార్యక్రమంకు వెళ్లినా కూడా ఇద్దరు కలిసి వెళ్లే వారని, ప్రగ్యా సినిమాల ఎంపిక విషయంలో పూర్తిగా క్రిష్‌ నిర్ణయాన్ని తీసుకుంటుందని చెబుతున్నారు. ఇవన్ని చూస్తుంటే ఖచ్చితంగా క్రిష్‌, రమ్యల విడాకులకు కారణం ప్రగ్యా జైస్వాల్‌ అయ్యి ఉంటుందని అనిపిస్తుంది. రమ్య డాక్టర్‌ అవ్వడంతో పాటు, ఉన్నత విధ్యను అభ్యసించింది. విడాకుల తర్వాత ఆమె విదేశాల్లో సెటిల్‌ అవ్వాలని భావిస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. క్రిష్‌ ప్రస్తుతం చేస్తున్న, చేయబోతున్న సినిమాలపై విడాకుల ఎఫెక్ట్‌ ఏమేరకు పడుతుందో చూడాలి.