టాలీవుడ్ స్టార్ డైరక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు.ప్రస్తుతం కాలంలో సినిమా దర్శకులు తాము చేసే సినిమాల అప్డేట్స్, టీజర్, ట్రైలర్ ఇలాంటి విషయాలకు సంబందించి ఎలాంటి విషయాలనైనా సరే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తారు.
అలాంటిది కొరటాల శివ సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని ప్రకటించారు.ఇక నుండి మీడియా మిత్రుల ద్వారా తన సందేశాలను అందిస్తానని అన్నారు.
కొరటాల శివ సడెన్ గా ఇలాంటి డెశిషన్ తీసుకోవడం పట్ల అందరు షాక్ అవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటుగా రాం చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.సినిమాకు సంబందించిన చివరి షెడ్యూల్ పెండింగ్ లో ఉంది.
త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత ఎన్.
టి.ఆర్ తో కొరటాల శివ సినిమా ఉంటుందని తెలిసిందే.ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ తో కొరటాల శివ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఆచార్య పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ.