ఆర్ధిక ఇబ్బందుల్లో కొరటాల శివ.. మూడేళ్ళుగా ఒకటే సినిమా అవ్వడంతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ తన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

 Director Koratala Shiva Of Struggles In Financial Difficulties-TeluguStop.com

ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు ఇతనికి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

గత మూడు సంవత్సరాల నుంచి కొరటాల శివ ఆచార్య సినిమా కోసం పనిచేస్తున్నారు.ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

 Director Koratala Shiva Of Struggles In Financial Difficulties-ఆర్ధిక ఇబ్బందుల్లో కొరటాల శివ.. మూడేళ్ళుగా ఒకటే సినిమా అవ్వడంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పలుసార్లు వాయిదా పడటం వల్ల నిర్మాతలు భారీ మొత్తంలో నష్టాలను చవి చూస్తున్నారని చెప్పవచ్చు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో నటించడం కోసం రామ్ చరణ్ కూడా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ నిర్మాత నిరంజన్ రెడ్డికి ప్రాఫిట్ అందజేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం పని చేస్తున్నటువంటి కొరటాల శివకు ఇంతవరకు రెమ్యూనరేషన్ అందలేదని తెలుస్తోంది.భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవి సినిమాలో పాల్గొన్న కొరటాల ఇప్పటి వరకు తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో తాను కూడా ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేది ఎప్పుడు అనే విషయం గురించి కూడా క్లారిటీ లేదు.

అందుకు గల కారణం ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లపై కొన్ని నిబంధనలు ఉన్న కారణంగా సినిమాను అధిక మొత్తంలో కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదు.దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమా విడుదలకాకపోవడంతో శివ పూర్తిగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలుస్తోంది.

#NiranjAn Reddy #Ramcharan #Chiranjeevi #Financial #Koratala Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు