మెగా ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చిన కొరటాల శివ.. అసలేం జరిగిందంటే..?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆచార్య రిలీజ్ డేట్ గురించి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా క్లారిటీ వస్తుందని మెగా ఫ్యాన్స్ భావించారు.

 Director Koratala Shiva Huge Shock To Mega Fans Details,  Details Here, Huge Sho-TeluguStop.com

అయితే రిలీజ్ డేట్ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.ఆచార్య రిలీజ్ డేట్ గురించి ఎప్పుడు స్పష్టమైన ప్రకటన వస్తుందో తెలియాల్సి ఉంది.

ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

మెగాస్టర్ చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్ కు గాడ్ ఫాదర్ అనే టైట్ల్ ఫిక్స్ అయినట్టు అఫీషియల్ గా పోస్టర్ రిలీజైంది.

మరోవైపు మెహర్ రమేష్ వేదాళం రీమేక్ భోళాశంకర్ పేరుతో తెరకెక్కుతున్నట్టు ప్రకటన వెలువడింది.బాబీ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా స్ట్రెయిట్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమాకు పోస్టర్ రిలీజ్ కాగా ఆ ఫోటోతో వింటేజ్ చిరంజీవి గుర్తుకువచ్చాడని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ చిరంజీవిని ప్రేక్షకులు ఏ విధంగా చూపించాలని అనుకుంటున్నారో అదే విధంగా చూపించబోతున్నారని తెలుస్తోంది.

Telugu Acharya, Bholaa Shankar, God, Shock, Koratala Shiva, Fans-Movie

షూటింగ్ దాదాపుగా పూర్తైన ఆచార్య సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.కరోనా థర్డ్ వేవ్ వల్ల ఆచార్య రిలీజ్ డేట్ గురించి ప్రకటన చేయడం లేదా.? లేక ఏపీలో థియేటర్ల సమస్య పరిష్కారం కాలేదని వెల్లడించడం లేదా.? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.

Telugu Acharya, Bholaa Shankar, God, Shock, Koratala Shiva, Fans-Movie

కొరటాల శివ తమకు స్పష్టత ఇవ్వకుండా మోసం చేశారంటూ కొంతమంది మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా త్వరలో ఆచార్య సినిమా షూటింగ్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.త్వరలో ఆచార్య గురించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube