అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బేనర్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదుపరి చిత్రం..

నాగార్జున, నాగ చైతన్య నటించిన `బంగార్రాజు`తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయనున్నారు.కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత.

 Director Kalyan Krishna's Next Film In The Top Production Company Studio Green B-TeluguStop.com

దక్షిణాది చలనచిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్ రిచ్ సినిమాలను నిర్మిస్తోంది.తెలుగులో కూడా అంతే ప్రజాదరణ పొందిన ఈ బ్యానర్పై నిర్మించిన పలు చిత్రాలు ఇక్కడ డబ్ చేసి విడుదలయ్యాయి.

ఈ సందర్భంగా కెఇ జ్ఞానవేల్ రాజా సోమవారంనాడు మాట్లాడుతూ, సంక్రాంతికి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మా బేనర్లో భారీ సినిమా చేయనున్న విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాం.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నామని తెలిపారు.

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను రూపొందించడంలో పేరుగాంచిన కళ్యాణ్ కృష్ణ, బంగార్రాజుతో ఒక ఆదర్శవంతమైన సంక్రాంతి సినిమాతో వచ్చినందుకు ప్రశంసలు అందుకున్నాడు, ఇది భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్రానికి సంబందించిన ఇతర వివరాలు త్వరలో స్టూడియో గ్రీన్ వారు వెల్లడించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube