డైరెక్టర్ రాఘవేంద్రరావు తీసిన పరమ చెత్త సినిమాలు ఇవే..!!  

director k raghavendra rao hit and flop movies, K raghavendraravu, marsiyal Address Care of the film, NTR, eennar, Chiranjeevi, Nagarjuna, Venkatesh, pellisandadi, Roshan, Srikanth, Balakrishna, the unique brothers, Rama thief, asvamedham, Venkatesh, kaliyugapandavulu - Telugu Asvamedham, Balakrishna, Chiranjeevi, Director K Raghavendra Rao Flops, Director K Raghavendra Rao Hits, Eennar, Kaliyugapandavulu, Keraghavendraravu, Marsiyal Address Care Of The Film, Nagarjuna, Ntr, Pellisandadi, Raghavendra Rao, Rama Thief, Roshan, Srikanth, The Unique Brothers, Venkatesh

కె.రాఘవేంద్రరావు అంటే కమర్షియల్ హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్.

TeluguStop.com - Director K Raghavendra Rao Hit And Flop Movies

ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి ఎంతోమంది హీరోలకి సూపర్ హిట్ చిత్రాలను అందించారు.ఒక మూసలో వెళ్తున్న సినిమాని కమర్షియల్ ఫార్ములాతో చక్కని సందేశం జోడించి సినీ లోకానికి మార్గదర్శకుడు అయినటువంటి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.ఈయన సినిమాల్లో నటిస్తే చాలు, బొమ్మ బ్లాక్ బస్టర్ అవుద్ది, హీరోగా బ్రేక్ వస్తుంది అని నమ్మేవారు.

విక్టరీ వెంకటేష్ ని హీరోగా లాంచ్ చేయమని రాఘవేంద్రరావు చేతుల్లో పెడితే, కలియుగపాండవులు సినిమాతో వెంకీకి పెద్ద హిట్ ఇచ్చారు.ఇక మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేయాల్సిన బాధ్యత మీదే అని సూపర్ స్టార్ కృష్ణ గారు రాఘవేంద్రరావు గారికి అప్పజెప్తే, రాజకుమారుడు సినిమాతో మహేష్ కి తిరుగులేని హిట్ ఇచ్చారు.ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది.ఇక మెగా వారసుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా గంగోత్రి సినిమాతో రాఘవేంద్రరావు చేతుల మీదుగా హీరోగా పరిచయం అయ్యారు.

TeluguStop.com - డైరెక్టర్ రాఘవేంద్రరావు తీసిన పరమ చెత్త సినిమాలు ఇవే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలా ఎన్టీఆర్ నాటి తరం నుంచి నేటి తరం హీరోల వరకూ హిట్ చిత్రాలను అందించారు.అలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రరావుకి కూడా ఫ్లాపులు తప్పలేదు.

ఎంతోమంది హీరోలకు హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు బాలకృష్ణకు మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు.రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, పట్టాభిషేకం, అపూర్వ సహోదరులు, దొంగ రాముడు, అశ్వమేధం, పాండురంగడు సినిమాలతో బాలకృష్ణకు ఫ్లాప్స్ ఇచ్చారు.ఇక నాగార్జునకి అగ్నిపుత్రుడు, జానకిరాముడు, ఆఖరిపోరాటం, అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకేంద్రుడు అగ్ని, షిరిడిసాయి, ఓం నమో వేంకటేశాయ సినిమాలతో ఫ్లాప్స్ ఇచ్చారు.వెంకటేష్ తో కలియుగపాండవులు అనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాఘవేంద్రరావు, ఆ తర్వాత తీసిన భారతంలో అర్జునుడు, సుభాష్ చంద్రబోస్ సినిమాలతో భారీ ఫ్లాప్స్ ని మిగిల్చారు.

అన్నమయ్య సినిమాతో రికార్డులు తిరగరాసిన రాఘవేంద్రరావు, ఇంటింటా అన్నమయ్య సినిమాని తెరకెక్కిస్తే, ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు.అయినప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు.

పెళ్లిసందడి సినిమాతో శ్రీకాంత్ కి ఎవర్ గ్రీన్ హిట్ ఇచ్చి, ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ కు పెళ్లిసందడి 2 తో ఎవర్ గ్రీన్ హిట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకేంద్రుడు.మామూలుగా ఏ దర్శకుడైనా ఓ పదేళ్ళు లేదా ఇరవై ఏళ్ళు డైరెక్టర్ గా కొనసాగుతారేమో.ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పది, పదిహేను సినిమాలు చేయడమే కష్టం.కానీ 75 లో బాబు సినిమాతో దర్శకుడిగా మారిన కె.రాఘవేంద్రరావు మాత్రం 45 ఏళ్ల పాటు తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారంటే మామూలు విషయం కాదు.పది, పాతిక సినిమాలు చేసిన డైరెక్టర్లకే అందులో ఐదారు ఫ్లాప్ లు ఉంటున్నాయి.

అలాంటిది వందకు పైగా సినిమాలు చేసిన రాఘవేంద్రరావు కెరీర్ లో ఫ్లాప్ లు ఉండడం అనేది చాలా చిన్న విషయం.ఆయన తీసిన బ్లాక్ బస్టర్స్ తో పోలిస్తే ఈ ఫ్లాప్ లు జుజుబీ లాంటివి.

#TheUnique #Eennar #Pellisandadi #Venkatesh #MarsiyalAddress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు