కుక్క మనిషిగా... మనిషి కుక్కగా మారే సినిమా.. ఎప్పుడొస్తుందంటే?

సాధారణంగా సినిమాలు అంటే ప్రేమ సినిమాలు , లేదంటే హర్రర్ సినిమాలు ఇలా ఒక్కొక్క కథాంశంతో సినిమాలు తెరకెక్కుతున్నాయి.ఇందులో కొన్ని హాస్య పూరితంగా మరికొన్ని ఎమోషనల్ గా కూడా ఉంటాయి .

 Director Happy With Naai Sekar Movie Response Naai Sekar, Dog, Sathish , Kish-TeluguStop.com

అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది.అదేమిటంటే ఒక మనిషి కుక్క గా, కుక్క మనిషి గా మారితే ఏం జరుగుతుంది అన్న కాన్సెప్టుతో ఒక సినిమా తెరకెక్కబోతోంది.

ఈ సినిమాను హాస్యభరితంగా తెరకెక్కించారు.ఈ సినిమా పేరు నాయ్ శేఖర్.ఈ సినిమాతో కిషోర్ రాజ్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ కల్పాతి ఎస్ అఘోరం,కల్పాతి ఎస్ గణేష్,కల్పాతి ఎస్ సురేష్ కలిసి ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాతో ప్రముఖ హాస్యనటుడు సతీష్ కుక్ విత్ కోమాలి ఫేమ్ పవిత్ర లక్ష్మి తొలిసారి హీరోహీరోయిన్ లుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.

ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు కిషోర్ రాజ్ కుమార్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.ఈ సందర్భంగా కిషోర్ రాజ్ మాట్లాడుతూ మనిషి కుక్క గాను, కుక్క మనిషిగా మారినపుడు ఏం జరుగుతుంది అనేదే ఈ చిత్ర అసలు కథ.ఈ సినిమా మొదటి నుంచి క్లైమాక్స్‌ వరకు పూర్తి హాస్యభరితంగా తెరకెక్కించాము అని తెలిపారు కిషోర్.ఇందులో ప్రధాన పాత్ర పోషించిన శునకానికి మరో హాస్య నటుడు, హీరో మిర్చి శివ డబ్బింగ్‌ చెప్పారు.

Telugu Kollywood, Naai Sekar, Pavitra Lakshmi, Sathish, Shanker Ganesh-Movie

ఇక దాదాపుగా 500 కు పైగా చిత్రాలకు సంగీత స్వరాలు సమకూర్చిన శంకర్‌ గణేష్‌ ఇందులో వైరిపాత్ర అనే విలన్‌ క్యారెక్టర్ లో నటించారు.వీరితో పాటు జార్జ్‌ మారియన్‌, లివింగ్‌స్టన్‌, మనోబాలా, ప్రిన్స్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.నేను కూడా ఓ ఆసక్తికరమైన పాత్రలో నటించాను అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమాలో ఒక పాటను హీరో శివకార్తికేయన్‌ తో పాడించాము.అలాగే, ఓ ప్రత్యేక పాటను సంగీతాన్ని అనిరుధ్‌ రవిచంద్రన్‌తో కంపోజ్ చేయించాము అని తెలిపారు కిషోర్.ఈ సినిమా విడుదలై అన్ని చోట్ల మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు దర్శకుడు కిషోర్ రాజ్ కుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube