తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్సించుకున్నారు.ఈ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు , ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, డైరెక్టర్ మలినేని గోపిచంద్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.








