అబ్బే ప్రేమ గీమా ఏమీ లేదు.. దర్శకుడు క్లారిటీ  

Director Gives Clarity On Love-director,heroin,love,malayalam,sai Pallavi,tamil,tollywood Updates,vijay

మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది. కొద్ది రోజుల్లోనే సాయి పల్లవి సౌత్‌లో నోటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. స్టార్‌డం వచ్చిన హీరోయిన్స్‌పై పుకార్లు రావడం అనేది చాలా కామన్‌, అలాగే సాయి పల్లవి విషయంలో కూడా పుకార్లు షికార్లు చేయడం మొదలు పెట్టాయి..

అబ్బే ప్రేమ గీమా ఏమీ లేదు.. దర్శకుడు క్లారిటీ-Director Gives Clarity On Love

పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన నేపథ్యంలో సాయి పల్లవి కెరీర్‌ పై ప్రభావం పడేలా ఉంది.

మొన్నటి వరకు సాయి పల్లవి హీరోలను గౌరవించదు అంటూ విమర్శలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా సాయి పల్లవి దర్శకుడు విజయ్‌తో ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కణం చిత్రం సమయంలో వీరిద్దరి మద్య పరిచయం అయ్యింది, అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కూడా ప్రస్తుతం చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అంటూ తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆవార్తలు జాతీయ మీడియాలో కూడా ప్రచారం చేయడం జరిగింది.

మీడియాలో వస్తున్న వార్తలపై దర్శకుడు విజయ్‌ క్లారిటీ ఇచ్చాడు.

తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసలు అలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్థం కావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను హీరోయిన్‌గా సాయి పల్లవిని అభిమానిస్తున్నాను అంటూ ఏదో సందర్బంలో చెప్పిన విషయాన్ని కొందరు కావాలని ఇలా రాద్దాంతం చేశారు అంటూ దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీడియాలో ఇకపై అయినా ఈ వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెడితే బాగుంటుందని అన్నాడు.

అయితే ఈ విషయమై సాయి పల్లవి ఇంకా ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు.