ఆ డైరెక్టర్ కు అబద్ధం చెప్పి రమ్యకృష్ణ మోసం చేసిందా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన వాళ్లలో రమ్యకృష్ణ ఒకరు.ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉండగా ఆమె నటిస్తున్న సినిమాలలో కొన్నిసినిమాలు సక్సెస్ సాధిస్తుంటే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంటున్నాయి.

 Director Geetha Krishna Shocking Comments About Ramyakrishna Goes Viral , Geethakrishna , Ticket Rates , Character Artist, Ramyakrishna , Shocking Comments , Tollywood , Geetha Krishna Shocking Comment-TeluguStop.com

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీ అప్పుడు టికెట్ రేట్లు పెంచమని చెప్పి ఇప్పుడు తగ్గించమని అడుగుతోందని ఆయన తెలిపారు.

 Director Geetha Krishna Shocking Comments About Ramyakrishna Goes Viral , Geethakrishna , Ticket Rates , Character Artist, Ramyakrishna , Shocking Comments , Tollywood , Geetha Krishna Shocking Comment-ఆ డైరెక్టర్ కు అబద్ధం చెప్పి రమ్యకృష్ణ మోసం చేసిందా.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డిస్ట్రిబ్యూటర్లు ఖర్చులు చెప్పి నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారని గీతాకృష్ణ అన్నారు.ప్రభుత్వం ఆన్ లైన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెస్తే పేమెంట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని నిర్మాతలు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఆన్ లైన్ టికెట్ల వల్ల చిన్న, మీడియం నిర్మాతలకు లాభమని ఆయన తెలిపారు.

థియేటర్ల వాళ్లు వ్యతిరేకత వ్యక్తం చేసినా ఇదే కరెక్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు.

సంకీర్తన సినిమా కోసం తాను కొత్తమ్మాయిని తీసుకోవాలని అనుకుని రమ్యకృష్ణను తీసుకున్నానని ఆయన తెలిపారు.తెలుగులో రమ్యకృష్ణను నేనే పరిచయం చేశానని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సినిమా రిలీజైన మూడేళ్లకు రమ్యకృష్ణ సంకీర్తన సినిమాకు ముందే మరో తెలుగు సినిమాలో చిన్న రోల్ లో నటించిందని తెలిసిందని ఆయన తెలిపారు.

Telugu Geetha Krishna, Geethakrishna, Ramyakrishna, Ticket Rates, Tollywood-Movie

ఆ విషయం తెలిసి నాకు కోపం వచ్చిందని గీతాకృష్ణ అన్నారు.నరసింహ సినిమా సక్సెస్ వల్ల రమ్యకృష్ణ పైకి వచ్చిందని గీతాకృష్ణ వెల్లడించారు.రమ్యకృష్ణను కెరీర్ తొలినాళ్లలో ఐరన్ లెగ్ అన్నారని ఆయన తెలిపారు.

రాఘవేంద్ర రావు సినిమా సక్సెస్ ఆమె కెరీర్ కు ప్లస్ అయిందని గీతాకృష్ణ వెల్లడించారు.రమ్యకృష్ణ తాను తెలుగులో నటించానని చెప్పకుండా డైరెక్టర్ ను ఒక విధంగా మోసం చేసిందనే చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube