చరణ్ గురించి అలా అనడం తప్పు.. కోట నీచుడు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్ వైరల్!

కొన్నిరోజుల క్రితం కోట శ్రీనివాసరావు చిరంజీవిని, రామ్ చరణ్ ను ఉద్దేశించి సంచలన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.కోట శ్రీనివాసరావు పాత విషయాలను దృష్టిలో ఉంచుకుని ఆ విధంగా కామెంట్లు చేశారని చాలామంది అభిప్రాయపడ్డారు.

 Director Geetha Krishna Shocking Comments About Kota Sreenivasa Rao Details Here-TeluguStop.com

ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలను చూసి చరణ్ నటన గురించి కోట శ్రీనివాసరావు కామెంట్లు చేస్తే బాగుంటుందని మరి కొందరు వెల్లడించారు.

అయితే ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన గీతాకృష్ణ కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్ల గురించి స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు.

చిరంజీవి ఆస్పత్రి కట్టడం నచ్చని పక్షంలో ఏ విధంగా చేస్తే బాగుంటుందో కోట శ్రీనివాసరావు చెబితే బాగుండేదని కానీ కోట శ్రీనివాసరావు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడతారని ఆయన తెలిపారు.కోకిల సినిమా సమయంలో కోట శ్రీనివాసరావు రెమ్యునరేషన్ 15,000 రూపాయలు అని ఆయన చెప్పుకొచ్చారు.

షూటింగ్ సమయంలో కోట ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను తిట్టాడని నేను ఆ సమయంలో కోట శ్రీనివాసరావుకు గట్టిగా ఇచ్చానని గీతాకృష్ణ వెల్లడించారు.ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ఉగాది సినిమా ఒక సమాధి అని కోట శ్రీనివాసరావు ఇ.వి.వి.సత్యనారాయణతో అన్నారని కోట మంచి నటుడు అని అయితే స్త్రీలను ఆయన చాలా నీచంగా చూస్తారని గీతాకృష్ణ కామెంట్లు చేశారు.కోట శ్రీనివాసరావును నీచుడు అని అంటారని ఆయన వెల్లడించారు.

Telugu Chirenjeevi, Geetha Krishna, Ram Charan, Ramcharan, Tollywood-Movie

కోట శ్రీనివాసరావును పెద్దాపురంలో కొట్టారని గీతాకృష్ణ తెలిపారు.చరణ్ కు నటన రాదని కోట చెప్పడం చాలా తప్పు అని కోట శ్రీనివాసరావు ఇలా మాట్లాడితే అవకాశాలను ఎవరు ఇస్తారని గీతాకృష్ణ పేర్కొన్నారు.కెమెరా ముందు కష్టపడే ప్రతి ఒక్కరూ శ్రామికుడే అని గీతాకృష్ణ తెలిపారు.కోట క్యారెక్టర్ మంచిది కాదని గీతాకృష్ణ కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube