డైరెక్టర్‌ను ఫిక్స్ చేసుకున్న చరణ్.. ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Director For Ram Charan Next Confirmed, Ram Charan, Acharya, Chiranjeevi, Korata-TeluguStop.com

కాగా ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి అదిరిపోయే రికార్డులను తిరిగరాసేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని, సినిమా కథకు ఈ పాత్ర చాలా కీలకం కానుందని చిత్ర వర్గాల టాక్.

అయితే చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ప్రస్తుతం ఓ దర్శకుడు చరణ్‌ను హీరోగా పెట్టి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

నేచురల్ స్టార్ నానితో కలిసి జెర్సీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి చరణ్ కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడట.ఈ కథను చరణ్‌కు వినిపించి ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ తరువాత తెరకెక్కించేందుకు గౌతమ్ రెడీ అవుతున్నాడు.కాగా ఆర్ఆర్ఆర్‌లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube