చంద్రబాబు-వైఎస్ కథపై అప్పుడే మొదలైన వివాదం

చంద్రబాబు, వైఎస్ రాజసేఖర్ రెడ్డి జీవిత కథలని స్పూర్తిగా తీసుకొని ఒక బయోపిక్ వెబ్ మూవీకి నిర్మాత విష్ణు ఇందూరి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై అఫీషియల్ గా ఇప్పటికే కన్ఫర్మేషన్ ఇచ్చారు.

 Director Deva Katta Tweet On Chandrababu And Ys Story Is Mine, Vishnu Induri, To-TeluguStop.com

అయితే ఈ వార్త బయటకి రాగానే దీనిపై వివాదం మొదలైంది.ప్రస్తానంతో దర్శకుడుగా తన సత్తా చాటిన దేవకట్టా నిర్మాత విష్ణు ఇందూరిపై ట్విట్టర్ ద్వారా నేరుగా ఆరోపణలు చేశారు.

నేను రాసిన ఓ కథను దొంగలించి సినిమా చేసిన ఓ వ్యక్తి దాంతో డిజాస్టర్ ను చవిచూశాడు.కానీ ఈసారి నేను అలా కానివ్వను.2017లో చంద్రబాబు నాయుడు- వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జీవితాలను ఆధారంగా చేసుకుని వారి మధ్య స్నేహం రాజకీయ వైరం అనే అంశాలతో ఫిక్షనల్ గా ఓ కథను రెడీ చేశాను.2017లో ఈ కథను బేస్ చేసుకుని పలు వెర్షన్ ను కూడా రెడీ చేసి కాపీ రైట్ చట్టం కింద రిజిష్టర్ చేయిస్తూ వస్తున్నాను.అయితే కొందరు నా ఆలోచనను హైజాక్ చేస్తున్నారు.

వాళ్ళు నేను రిజిస్టర్ చేయించిన స్టొరీ సీన్ లు కాపీ చేసి నన్ను లీగల్ గా ప్రొసీడ్ అయ్యేలా చేయరనే అనుకుంటున్నాను.

హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ స్పూర్తితో ఈ కథని సిద్ధం చేసుకున్నాను.తర్వాత దీన్ని వెబ్ సిరీస్ గా మార్చుకున్నాను.మా టీమ్ కొన్ని మేజర్ ఓటీటీలను కలిసి ఈ ఐడియా చెప్పారు.మా లీగల్ టీమ్ ఈ వ్యవహరాన్ని గమనిస్తున్నారు అని దేవాకట్టా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

నేను 2015 డిసెంబర్ లో విష్ణు ఇందూరితో ఎన్టీఆర్ బయోపిక్ చర్చల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అని దేవకట్టా మరో ట్వీట్ చేసి ఆరోపించడం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.దేవా కట్ట ఆరోపణలపై ప్రొడ్యూసర్ విష్ణు ఇందూరి ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

మీ అందరికి దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.నేను ఓ రీమేక్ సినిమా కోసం 2015 డిసెంబర్ లో దేవా కట్ట ని కలిసాను.

అదే సమయంలో బేసిక్ స్క్రీన్ ప్లేతో ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నాను.అయితే దేవ కట్టా ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఎలాంటి స్టోరీ చెప్పలేదు అని విష్ణు ఇందూరి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube