ఆది పురుష్ కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న దర్శకుడు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.టి-సిరీస్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

 Director Creates Separate Universe For Adipurush, Saif Ali Khan, Kriti Sanon, Om-TeluguStop.com

మైథలాజికల్ కథాంశం రామాయణం ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ఓ రావత్ తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండగా, సీతగా కృతి సనన్ కనిపించబోతుంది.

అలాగే లక్ష్మణుడు పాత్ర కోసం విక్కీ కౌశల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

కంప్లీట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.సినిమాలో సన్నివేశాలు అన్ని కూడా గ్రీన్ మ్యాట్ మీదనే షూట్ చేసి తరువాత విజువల్ ఎఫెక్ట్స్ తో సరికొత్త ప్రపంచం క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలని మాత్రమే కంప్లీట్ మోషన్ క్యాప్చర్ లో షూట్ చేసేవారు.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొచ్చడియాన్, రోబో, రావణ్ సినిమాలని గ్రీన్ మ్యాట్ స్టూడియోలో మోషన్ క్యాప్చర్ లో షూట్ చేశారు.

అయితే మొదటి సారి ఒక మైథలాజికల్ కథాంశాన్ని మోషన్ క్యాప్చర్ ద్వారా ఆవిష్కరిస్తున్నారు.అలాగే రామాయణం అంటే ద్వాపరయుగం కాలం కాబట్టి అప్పటి కాలమాన, వాతావరణ, చారిత్రిక ఆనవాళ్ళు బట్టి ఇప్పటి వరకు రామాయణంలో చూపించిన తరహాలో కాకుండా సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు ఓం రావత్ సృస్టించబోతున్నట్లు తెలుస్తుంది.

దీనికోసం ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ తో డ్రాయింగ్స్ కూడా వేయించడం జరిగిందని తెలుస్తుంది.ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి విర్చువల్ లో అప్పటి ప్రపంచాన్ని తెరపై విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

దీనికోసం ఏకంగా 250 కోట్లకి పైగా ఖర్చు పెట్టబోతున్నారని తెలుస్తుంది.ఇంకా ఈ ఖర్చు పెరిగే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో సినిమాకి 500 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.అయితే సినిమాకి ఆ స్థాయిలో పెట్టినా కూడా ప్రభాస్ కి ఉన్న మార్కెట్ రేంజ్ బట్టి రిలీజ్ కి ముందే బిజినెస్ జరిగిపోయే అవకాశం ఉందని బి-టౌన్ లో వినిపిస్తున్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube