ఆంధ్రా సినిమాలు ఇక్కడ చూసినప్పుడు 'ఇస్మార్ట్‌ శంకర్‌' అక్కడ ఎందుకు చూడరు?  

Director Comments On Ismart Shanker Movie-ismart Shanker,nabha Natesh,nidhi Agarwal,puri Jaganth,ram Pothineni

రామ్‌, పూరిల కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్‌ శంకర్‌ వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీరిద్దరికి కూడా ఈ చిత్రం సక్సెస్‌ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కూడా సక్సెస్‌ కోసం చకోరా పక్షి మాదిరిగా ఎదురు చూస్తున్నారు..

ఆంధ్రా సినిమాలు ఇక్కడ చూసినప్పుడు 'ఇస్మార్ట్‌ శంకర్‌' అక్కడ ఎందుకు చూడరు?-Director Comments On Ismart Shanker Movie

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో పూరికి టెన్షన్‌ ఎక్కువ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా ప్రివ్యూ షోను చూసిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యారు.

ప్రివ్యూ చూసిన తర్వాత పూరి మాట్లాడుతూ సినిమా అంతా పూర్తి అయ్యింది. ఇక సెన్సార్‌ చేయించి విడుదల చేయడమే బ్యాలన్స్‌.

ఇది తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం నాకుంది. రామ్‌ మంచి నటుడు. వాడుకున్న వారికి వాడుకున్నంత..

అతడి నుండి సాధ్యం అయినంత ట్యాలెంట్‌ను పిండేసుకున్నాను. అతడి వద్ద ఇంకా ఉంది. ఒక విభిన్నమైన సినిమాగా ఇది నిలుస్తుందనే నమ్మకంను పూరి వ్యక్తం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఇటీవల ఒక వైజాగ్‌ బయ్యర్‌ నా వద్దకు వచ్చి రామ్‌ చెప్పిన తెలంగాణ యాస డైలాగ్స్‌ను ఆంధ్రా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే కష్టపడాల్సిందే. ఆంధ్రాలో ఈసినిమా చూస్తారా అంటూ అనుమానం వ్యక్తం చేశాడట. ఆ వ్యక్తి అనుమానంపై పూరి స్పందిస్తూ ఎప్పటి నుండో ఆంధ్రా యాసతో వస్తున్న సినిమాలను తెలంగాణ ప్రేక్షకులు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను ఆంధ్రౄ ప్రేక్షకులు ఎందుకు చూడరు అంటూ పూరి ప్రశ్నించాడు.

రామ్‌ పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడటంతో పాటు చాలా మాస్‌ లుక్‌లో కూడా కనిపించబోతున్నాడు.