లూసిఫర్ రీమేక్ కు మళ్లీ డైరెక్టర్ చేంజ్..?!  

director changes again for lucifer remake ,Chiranjeevi, chiru, Lucifer movie, remake, director, movie updates - Telugu Chiranjeevi, Chiru, Director, Lucifer Movie, Movie Updates, Remake

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 తో భారీ విజయాన్ని అందుకున్న ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ పర్యవేక్షణలో ఆచార్య సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - Director Changes Again For Lucifer Remake

కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండాల్సిందే.ప్రస్తుతం ఈ సినిమాను 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత మెగా స్టార్ మలయాళం సినిమా లూసిఫెర్ రీమేక్ తెలుగులో నటించబోతున్నాడు.అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు దర్శకులను మార్చిన మెగాస్టార్ మరోసారి డైరెక్టర్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

TeluguStop.com - లూసిఫర్ రీమేక్ కు మళ్లీ డైరెక్టర్ చేంజ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే.

Telugu Chiranjeevi, Chiru, Director, Lucifer Movie, Movie Updates, Remake-Latest News - Telugu

లూసిఫర్ సినిమా ను తెలుగులో రీమేక్ చేసే సమయానికి ఆ సినిమా కొత్తగా మార్పులు జరగడం లేదని ముందుగా ప్రభాస్ తో సాహో తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా నుంచి తప్పించగా ఆ తర్వాత డైరెక్టర్ సుజిత్ సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా వచ్చాడు.ఆయన కూడా తనదైన స్టైల్ లో పలు మార్పులు చేసి ఫైనల్ అవుట్ పుట్ చిరంజీవి చరణ్ లకు వినిపించగా వారికి అంతగా నచ్చలేదని తెలుస్తోంది.దీంతోనే వీరిద్దరు కలిసి వి.వి.వినాయక్ ప్లేస్ లో మరో డైరెక్టర్ ను తీసుకోబోతున్నట్లు గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి.ఇందులో భాగంగానే ఇది వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీసిన హరీష్ శంకర్ ఖాళీగా ఉండటంతో ఈ సినిమా బాధ్యతలను అతనికి అప్పగించబోతున్నట్లు టాక్.

హరీష్ శంకర్ కి రీమేక్ సినిమాలని బాగా తీర్చిదిద్దుతాడు అన్న నమ్మకంతో అందులో కూడా ఇదివరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్, అలాగే మెగా హీరో అయినా వరుణ్ తేజ గద్దల కొండ గణేష్ తో నిరూపించుకున్నాడు.

ఇక ఇదే నిజమైతే చివరకు లూసిఫర్ సినిమాను హరీష్ శంకర్ ఆయన స్టైల్ లో కమర్షియల్ టచ్ ఇస్తారని తెలుస్తోంది.చూడాలి మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల విషయంలో ఇలాంటి మార్పులు ఇదివరకు జరిగినవే కాబట్టి ఈ సినిమాలో కూడా ఇంకెన్ని మార్పులు సంభవిస్తాయో వేచిచూడాలి.

#Chiru #Chiranjeevi #Remake #Director

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Changes Again For Lucifer Remake Related Telugu News,Photos/Pics,Images..