కార్తికేయ సీక్వెల్ పక్కన పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమా స్టార్ట్ చేసిన దర్శకుడు  

Director Chandu Mondeti Started Lady orientated Movie, Tollywood, Karthikeya 2, Telugu Cinema, Peoples Media Factory, Director Chandu Mondeti - Telugu Director Chandu Mondeti, Director Chandu Mondeti Started Lady Orientated Movie, Karthikeya 2, Peoples Media Factory, Telugu Cinema, Tollywood

కార్తికేయ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో దర్శకుడుగా తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి చందూ మొండేటి.ఈ దర్శకుడు చేసిన సినిమాలు తక్కువే అయిన మంచి టాలెంటెడ్ అనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు.

TeluguStop.com - Director Chandu Mondeti Started Lady Orientated Movie

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ అతన్ని డిస్టర్బ్ చేయకపోతే అద్భుతమైన కథలని తెరపై ఆవిష్కరించే సామర్ధ్యం అతని సొంతం అనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.ఇక ఈ యువ దర్శకుడు తన నాలుగో చిత్రంగా కార్తికేయ సీక్వెల్ ని ఆ మధ్య ప్రకటించాడు.

TeluguStop.com - కార్తికేయ సీక్వెల్ పక్కన పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమా స్టార్ట్ చేసిన దర్శకుడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఏకంగా 25 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు.కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఇందులో మైథాలజీ ఎలిమెంట్ ని సైన్స్ ని కనెక్ట్ చేయబోతున్నట్లు కాన్సెప్ట్ ద్వారా తెలియజేశారు.ఇదిలా ఉంటే ఈ భారీ బడ్జెట్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది దర్శకుడు ప్రకటించలేదు.

అయితే ఊహించని విధంగా చందూ మొండేటి ఈ కార్తికేయ సీక్వెల్ ని పక్కన పెట్టి తక్కువ బడ్జెట్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు.

నివేతా పెతురాజ్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తుంది.ఇక థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఇక సినిమా గురించి పూర్తి వివరాలు తెలియకపోయిన హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ బాషలలో తెరకెక్కించనున్నట్లు సమాచారం.అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమా స్టార్ట్ చేసిన చందూ కార్తికేయ సినిమాని పక్కన పెట్టాడా లేక భారీ బడ్జెట్ సినిమా కాబట్టి కొంత టైం తీసుకొని కరోనా పరిస్థితులు కంట్రోల్ అయ్యాక చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

#DirectorChandu #DirectorChandu #PeoplesMedia #Karthikeya 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Chandu Mondeti Started Lady Orientated Movie Related Telugu News,Photos/Pics,Images..