ఈ చేప పిల్లని ముంబై లో వల వేసి పట్టారంట...

తెలుగులో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” అనే చిత్రంలో హీరోగా నటించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కి జంటగా ముంబై బ్యూటీ కృతి శెట్టి నటించగా విలన్ గా ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించాడు.

 Director Buchi Babu Sana About Heroine Krithi Shetty Uppena Movie Offer, Uppena Movie Reviews, Director Buchi Babu Sana, Krithi Shetty, Krithi Shetty Uppena Movie Review, Tollywood,-TeluguStop.com

కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.కాగా తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సాన, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ క్ కృతి శెట్టి తదితరులు ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సాన ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పంచుకున్నాడు.

 Director Buchi Babu Sana About Heroine Krithi Shetty Uppena Movie Offer, Uppena Movie Reviews, Director Buchi Babu Sana, Krithi Shetty, Krithi Shetty Uppena Movie Review, Tollywood, -ఈ చేప పిల్లని ముంబై లో వల వేసి పట్టారంట#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ ఈ చేప పిల్ల ని ఎక్కడ పట్టారని హీరోయిన్ కృతి శెట్టి గురించి దర్శకుడిని అడిగింది.

దీంతో బుచ్చిబాబు సాన ఈ అందమైన చేప పిల్ల ని ముంబైలో గాలమేసి పట్టామని చెప్పుకొచ్చాడు.అంతేకాక ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలా మందిని ఆడిషన్ చేశామని కానీ తనకి ఎవరూ అంతగా నచ్చలేదని, చివరికి కృతి శెట్టి నటన ప్రతిభ మరియు అందం అభినయం చూసి ఎంపిక చేశామని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం కృతి శెట్టి కి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉందని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రం ఆడియో పరంగా మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.

దీనికి తోడు ఈ చిత్రంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.కాగా ఈ రోజు ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనది.

ఈ భారీ అంచనాలకి తగ్గట్టుగానే ఉప్పెన చిత్రం ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.కానీ కొన్ని చోట్ల టికెట్ల రేట్లను పెంచడంతో కొంతమేర సినీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube