బోయపాటి, రామ్ చరణ్ సినిమాకి భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడా?     2018-03-02   04:45:46  IST  Raghu V

బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ షూట్ కూడా పూర్తి చేసేసాడు బోయపాటి. ఇప్పుడు రెండవ షెడ్యూల్ ను కూడా ఈ నెల 6వ తేదీన నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. హైదరాబాద్ అల్యూమినియం ఫాక్టరీలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించనున్నారు. అయితే, ఈ యాక్షన్ సీన్స్ చరణ్ తదితరులపైన వుండనున్నట్లు తెలుస్తుంది.

కాగా, ఈ చిత్రం కోసం బోయపాటి 15 కోట్లు పారితోషికంగా తీసుకోనున్నట్టు ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు అదే వార్త సోషల్ మీడియా లో కూడా హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ సినిమాకి మునుపు బోయపాటి శ్రీను 10 కోట్ల వరకే తీసుకోనేవాడట.

ఈ సినిమాతో తొలిసారిగా ఆయన 15 కోట్ల పారితోషికాన్ని అందుకోనున్నాడని అంటున్నారు. రాజమౌళి విషయాన్ని పక్కన పెడితే, పారితోషికం విషయంలో త్రివిక్రమ్ .. కొరటాల సరసన తాజాగా బోయపాటి కూడా చేరిపోయాడని చెప్పుకుంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో చరణ్ న్యూ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి బోయపాటి అడిగిన పారితోషికానికి తగ్గట్టు సినిమా చూపిస్తాడా, లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలియనుంది. ఇప్పటికే చిరు నుంచి టిప్స్ అందుకున్న బోయపాటి మంచి కాన్ఫిడెన్స్ తో దూసుకుపోతున్నట్లు సమాచారం.