విశాల్ ను టార్గెట్ చేస్తూ…భారతీ రాజా సంచలన నిర్ణయం!  

Director Bharathiraja sensational decision against Actor Vishal, Director Bharathi raja , Actor Vishal, -

తమిళ సినీ దర్శకుడు భారతీ రాజా సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఉన్న నిర్మాతల మండలి అసోసియేషన్ కు వ్యతిరేకంగా కొత్తగా మరో అసోసియేషన్ ను ఫామ్ చేసినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - Director Bharathi Raja Sensational Decision Against Actor Vishal

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

గత కొంత కాలంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు,నటుడు విశాల్ తో అసోసియేషన్ పరంగా విభేదాలు ఎదురైనా విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో విశాల్ ను టార్గెట్ చేస్తూ భారతీ రాజా ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

TeluguStop.com - విశాల్ ను టార్గెట్ చేస్తూ…భారతీ రాజా సంచలన నిర్ణయం-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ దాదాపు రూ.7 కోట్ల మేరకు అసోసియేషన్ డబ్బుల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆయన ఆరోపిస్తున్నారు.ఇలా కొత్త అసోసియేషన్ ను ఫామ్ చేసి కొంతమంది మంచి నిర్మాతలను కాపాడే ప్రయత్నమే అని దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి అంటూ భారతీ రాజా విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం ఉన్న నిర్మాతల మండలి మంచి నిర్మాతలకు ఎలాంటి మంచి జరగడం లేదని, మంచి వారిని టార్గెట్ చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు అంటూ భారతీరాజా ఆరోపించారు.

ప్రస్తుతం ఉన్న నిర్మాతల మండలికి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంచం బాధగానే ఉన్నప్పటికీ కొంతమంది నుంచి మంచివారిని కాపాడే ప్రయత్నమే ఈ కొత్త అసోసియేషన్ ఏర్పాటు అంటూ భారతీ రాజా స్పష్టం చేశారు.

నిర్మాతల మండలి లో సభ్యులుగా ఉన్న భారతీ రాజా కు అలానే అసోసియేషన్ అధ్యక్షుడు విశాల్ కు గత కొద్దీ రోజులుగా విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే.

గతంలో కూడా ఈ విభేదాల కారణంగా బహిరంగంగానే ఒకరినొకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు.ఇప్పుడు తాజాగా దర్శకుడు భారతీ రాజా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Bharathi Raja Sensational Decision Against Actor Vishal Related Telugu News,Photos/Pics,Images..