ఐతే 'పవర్‌' బాబీ మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయక తప్పదా?

రచయితగా పలు సినిమా లకు వర్క్‌ చేసి పవర్ సినిమా తో దర్శకుడిగా మారిన బాబీ అలియాస్ రవీంద్రనాథ్ ఒక్కో సినిమా కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు.పవర్‌ తెరకెక్కించిన వెంటనే పవన్‌ కళ్యాణ్ తో సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు.

 Director Baby Wait For Few More Months-TeluguStop.com

ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తదుపరి సినిమా కు చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఎన్టీఆర్‌ తో మూడు పాత్రలు చేయించి జై లవ కుశ అనిపించాడు.

ఆ సినిమా తో ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు అందరికి కూడా బాబీపై గురి కుదిరింది.అందుకే వెంకీ మామ ఛాన్స్ దక్కింది.

 Director Baby Wait For Few More Months-ఐతే పవర్‌’ బాబీ మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయక తప్పదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని వెంకీ మామ నిరాశ పర్చాడు.అయినా కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాను చేసే అవకాశంను దక్కించుకున్నాడు.

గత ఏడాది కాలంగా మెగాస్టార్‌ చిరంజీవితో సినిమాను చేయడం కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు బాబీ వచ్చే నెలలో సినిమా ను పట్టాలెక్కించబోతున్నట్లుగా రెండు మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.కాని అవి పుకార్లే అంటూ నేడు క్లారిటీ వచ్చేసింది.

చిరంజీవి తదుపరి సినిమా బాబీ తో కాదని తేలిపోయింది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Director Baby, Film News, Movie News In Telugu-Movie

చిరంజీవి ప్రస్తుతం గాడ్‌ ఫాదర్‌ సినిమా ను చేస్తున్నాడు.ఆ సినిమా తర్వాత వెంటనే భోళా శంకర్ సినిమాను చేయాల్సి ఉంది.కాని బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ను చేయబోతున్నాడు.

ఆ తర్వాత భోళా శంకర్‌ సినిమాను పట్టాలెక్కిస్తారు అంటూ రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఎట్టకేలకు ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు.

భోళా శంకర్‌ సినిమా వాయిదా పడలేదు.ఆ సినిమా ను నవంబర్ 11న ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు.

నవంబర్‌ 15 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు టార్గెట్ గా చిరంజీవి ఈ రెండు సినిమా లు చేస్తున్నాడు.

ఇదే సమయంలో చిరంజీవి బాబీ దర్శకత్వం లో సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేశాడనే వార్తలు వస్తున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ వరకు బాబీ వెయిట్‌ చేయాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఆచార్య విడుదల అవ్వాలి మరియు గాడ్‌ ఫాదర్ ఇంకా భోళా శంకర్ సినిమా షూటింగ్‌ లు పూర్తి అయ్యేంత వరకు బాబీ కి చిరు డేట్లు ఇచ్చే అవకాశం లేదు.

#Bhola Shankar #Chiranjeevi #Baby

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube