ప్రభాస్ అలాంటి వ్యక్తి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు బి.గోపాల్?

Director B Gopal Shocking Comments About Hero Prabhas

స్టార్ హీరో ప్రభాస్, స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో అడవిరాముడు అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 Director B Gopal Shocking Comments About Hero Prabhas-TeluguStop.com

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అబవ్ యావరేజ్ గా నిలిచింది.ఏ సెంటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా బీ, సీ సెంటర్లలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడింది.

తాజాగా ఈ సినిమా గురించి, ప్రభాస్ గురించి మాట్లాడుతూ బి.గోపాల్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.హీరో ప్రభాస్ బంగారం అని బి.గోపాల్ చెప్పుకొచ్చారు.

 Director B Gopal Shocking Comments About Hero Prabhas-ప్రభాస్ అలాంటి వ్యక్తి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు బి.గోపాల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వర్షం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ అడవిరాముడు అనే సినిమాలో హీరోగా నటించారు.సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అడవిరాముడు ప్రత్యేకమైన సినిమా కాగా అదే టైటిల్ తో ఈ సినిమా కూడా తెరకెక్కడం గమనార్హం.

ముదుమలై ఫారెస్ట్ లో ఏకంగా 50 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేశారు.మొదట ఈ సినిమాకు అడవి రాముడు టైటిల్ అని అనుకోలేదని నిర్మాత అడ్డాల చంటి ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట పాడుతుంటే ఆ పాటను సినిమాలో పెడదామని తాను చెప్పానని బి.గోపాల్ అన్నారు.

ఆ తర్వాత ఆ పాట చేయాలని మణిశర్మను తాను ఒప్పించానని బి.గోపాల్ చెప్పుకొచ్చారు.టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రభాస్ ఏనుగుపై వచ్చే సీన్ ను ఇంట్రడక్షన్ సీన్ గా మార్చామని బి.గోపాల్ పేర్కొన్నారు.ఈ సినిమా షూటింగ్ సమయానికి ఆర్తి అగర్వాల్ బాగా లావు అయ్యారని అయినప్పటికీ తాము ముందుగా ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా షూటింగ్ ను పూర్తి చేశామని బి.గోపాల్ వెల్లడించారు.

Telugu 50 Days, Adaviramudu, Arthi Agrawal, B Gopal, Prabhas, Shocking Comments, Tollywood-Movie

ప్రభాస్ తండ్రితో ఉన్న పరిచయం వల్ల ప్రభాస్ ను ఆ సినిమా కోసం తీసుకున్నానని బి.గోపాల్ చెప్పుకొచ్చారు.అప్పటి ప్రభాస్ కు, ఇప్పటి ప్రభాస్ కు ఎంతో తేడా ఉందని క్రేజ్ విషయంలో ప్రభాస్ ప్రస్తుతం ఎక్కడో ఉన్నారని బి.గోపాల్ పేర్కొన్నారు.

#Adaviramudu #Arthi Agrawal #Prabhas #Gopal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube