దర్శకుడి కూతురుని రేప్‌ చేస్తామంటూ మోడీ ఫాలోవర్స్‌ బెదిరింపులు  

Director Anurag Kashyap Comments On Modi-bjp,director,modi,అనురాగ్‌ కశ్యప్‌,నరేంద్ర మోడీ

దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా కొనసాగింది. 2014 ఎన్నికల్లో అద్బుతమైన విజయాన్ని దక్కించుకున్న మోడీ కొన్నాళ్లకే ఫేడ్‌ ఔట్‌ అవుతాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక వైపు బీజేపీ వర్గాలు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటున్న సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన బీజేపీ కార్యకర్తలం అంటూ చెప్పుకుంటున్న వ్యక్తుల గురించి మోడీకి ఫిర్యాదు చేయడం జరిగింది..

దర్శకుడి కూతురుని రేప్‌ చేస్తామంటూ మోడీ ఫాలోవర్స్‌ బెదిరింపులు-Director Anurag Kashyap Comments On Modi

గతంలో అనురాగ్‌ కశ్యప్‌ కొన్ని సందర్బాల్లో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం జరిగింది. మోడీ ప్రధానిగా జనాలకు సంతృప్తినివ్వడం లేదని, ఆయన వల్ల సామాన్యులు కష్టపడుతున్నారు అంటూ గతంలో అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై మోడీ అభిమానులం అంటూ చెప్పుకుంటున్న కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అనురాగ్‌ కశ్యప్‌ కూతురు సోషల్‌ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీ నాన్న మరోసారి మోడీ గురించి విమర్శలు చేస్తే నిన్ను రేప్‌ చేస్తామంటూ అనురాగ్‌ కశ్యప్‌ కూతురుకు బెదిరింపులు వచ్చాయి. అనురాగ్‌ కశ్యప్‌ కూతురును బెదిరించిన వారు వారి పేరుకు ముందు మోడీ పెట్టుకుంటున్నట్లుగా చౌకీదార్‌ అంటూ పెట్టుకోవడం జరిగింది. అందుకే వీరు మీ ఫాలోవర్స్‌ అంటూ అనురాగ్‌ కశ్యప్‌ మోడీకి ట్వీట్‌ చేశాడు.

ట్వీట్‌లో మీరు మరోసారి ప్రధాని అయినందుకు శుభాకాంక్షలు. ఈ సందర్బంగా మీకు ఈ విషయాన్ని తెలియజేయదల్చుకున్నాను అంటూ వారు చేసిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది..

మోడీ దీనిపై ఎలా రియాక్ట్‌ అవుతాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.