బండ్ల బాబు కామెడీకి బ్రేక్ ఇవ్వడానికి రెడీ అయిన అనిల్ రావిపూడి

బండ్ల గణేష్ బాబు కమెడియన్ గా టాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించాడు.అలాగే హీరో ఫ్రెండ్ గా కూడా నటించాడు.

 Director Anil Ravipudi Use Bandla Ganesh Comedy Timing-TeluguStop.com

అయితే ఎ ఒక్క సినిమా కూడా నటుడుగా అతనికి సరైన గుర్తింపు ఇవ్వలేదు.దీంతో ఇండస్ట్రీలో పెద్దవాళ్ళతో ఉన్న పరిచయాలని ఉపయోగించుకొని మెల్లగా నిర్మాతగా మారిపోయి పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించేసాడు.

దీంతో ఒక్కసారిగా బండ్ల గణేష్ స్టార్ తిరిగిపోయింది.వ్యాపారేవేత్తగా ఇప్పుడు మంచి ఊపులో ఉన్నాడు.

సినిమాలలో నటన పూర్తిగా వదిలేసాడు.

అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఫుల్ టైం కమెడియన్ గా బండ గణేష్ రీ ఎంట్రీ మహేష్ బాబు మూవీతో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమాలో బండ్ల గణేష్ కు బండ్ల గణేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఆయన కోసం దర్శకుడు అనీల్ పాత్రను డిజైన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.సినిమాలో బండ్ల గణేష్ బాగా డబ్బున్న శ్రీమంతుడిగా చాలా అమాయకపు వ్యక్తిగా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube