పాపం : వింత ఫోబియాతో భయపడుతున్న మహేష్ దర్శకుడు...

టాలీవుడ్ లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించినటువంటి పటాస్ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.అయితే ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన టువంటి అనిల్ రావిపూడి కూడా వచ్చి రావడంతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తరువాత తన సినీ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది.

 Director Anil Ravipudi Suffering With Flight Phobia-TeluguStop.com

అయితే తాజాగా అనిల్ రావిపూడి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తనకు సంబంధించి కొన్ని వ్యక్తిగత అంశాలను తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తనకు విమానంలో ప్రయాణించాలంటే చాలా భయం గా ఉంటుందని అందువల్లనే సాధ్యమైనంతవరకు విమానాల్లో ప్రయాణం చేయడానికి వెనకాడటం అని చెప్పుకొచ్చాడు.అంతేగాక తనకు ఫ్లైట్ ఫోబియో ఉందని కూడా చెప్పుకొచ్చాడు.

ఒకవేళ తాను విమానంలో ప్రయాణించేటపుడు ఏదైనా కుదుపులు వచ్చినా, అలాగే ల్యాండింగ్ సమయంలో కూడా చాలా భయమేస్తుందని అన్నాడు.ఇలా తన ఫ్లైట్ ఫోబియో గురించి చెప్పుకుంటూ పోతే ఒక మంచి సినిమా తీయొచ్చని సరదాగా నవ్వారు.

అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి తన మిత్రులు కూడా తనను సరదాగా ఆట పట్టిస్తుంటారనీ, అంతే కాక ఎక్కువగా తక్కువ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లడానికి కారు ప్రయాణం చేయడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు.

Telugu Anil Ravipudi, Anilravipudi, Mahesganil-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించినటువంటి “సరిలేరు నీకెవ్వరు” చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించగా, హీరోయిన్ గా రష్మిక మందన్న నటించింది.అలాగే ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్నటువంటి ఎఫ్3 చిత్రంపై దృష్టి సారిస్తున్నా డు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube