మహేష్ సినిమా కంటే ముందు ఆ దర్శకుడు ప్లానింగ్ వేరే!  

Director Anil Ravipudi Plan To Lady Oriented Movie -

ఎఫ్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.ఈ క్రేజీ దర్శకుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సూపర్ స్టార్ మహేష్ తో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే.

Director Anil Ravipudi Plan To Lady Oriented Movie

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది.ఇలాంటి టైంలో ఊహించని విధంగా ఇప్పుడు అనిల్ రావిపూడి గురించి మరో హాట్ టాపిక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.

అనిల్ మహేష్ తో సినిమా కంటే ముందుగా తక్కువ బడ్జెట్ తో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి ప్లాన్ చేసాడని, దీనికి ఇప్పటికే అంతా రంగం సిద్ధం అయ్యిందని టాక్ వినిపిస్తుంది.ఇది ఆడవాళ్ళ సమస్యల నేపధ్యంలో తన స్టైల్ లో సాగి ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఇక ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు మహేశ్ సైతం అనిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.అంతేకాదు ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తనతో సినిమా చేసుకునే కమిట్మెంట్ అనిల్ రావిపూడికి మహేశ్ బాబు ఇచ్చాడని తెలిసింది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Anil Ravipudi Plan To Lady Oriented Movie- Related....