అనిల్ రావిపూడి ఆ ఇద్దరినీ ఒప్పిస్తాడా!

Director Anil Ravipudi Movie With Mega Brothers

అనిల్ రావిపూడి రోజురోజుకూ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు సంపాదిస్తున్నాడు.వరస పెట్టి హిట్స్ కొడుతూ వెనుతిరిగి చూసుకోవడం లేదు.

 Director Anil Ravipudi Movie With Mega Brothers-TeluguStop.com

ఇప్పటి వరకు ప్లాప్ లేని డైరెక్టర్లలో అనిల్ కూడా ఉన్నాడు.అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన ‘సరిలేరు నీకెవ్వరూ‘ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

మహేష్ కెరీర్ లో కూడా బిగ్ సక్సెస్ గా ఈ సినిమా నిలిచింది.

 Director Anil Ravipudi Movie With Mega Brothers-అనిల్ రావిపూడి ఆ ఇద్దరినీ ఒప్పిస్తాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రెసెంట్ అనిల్ F3 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.ఇది F2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.

ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధం అవుతుంది.

ఈ సినిమా తర్వాత అనిల్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు.

ఇక ఆ తర్వాత అనిల్ లిస్ట్ లో మెగా హీరోలు ఉన్నట్టు తెలుస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఒప్పించేందుకు అనిల్ చాలా కష్ట పడుతున్నట్టు తెలుస్తుంది.వీరిద్దరితో సినిమా తీయాలంటే అంత సామాన్య విషయం కాదు.

ప్రెసెంట్ వీరికి స్క్రిప్ట్ వినిపించడానికి అనిల్ సిద్ధం అవుతున్నాడు.బాలకృష్ణ సినిమా స్టార్ట్ అయ్యేలోపు పవన్ తో స్క్రిప్ట్ పరంగా చర్చలు సాగించాలని చెప్పుకొస్తున్నారు అనిల్.

ప్రెసెంట్ మెగా బ్రదర్స్ ఇద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు.చిరు ఆచార్య సినిమా చేస్తూనే గాడ్ ఫాదర్, భోళా శంకర్, సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో కూడా సినిమా స్టార్ట్ చేసాడు.ఒకేసారి అన్ని సినిమాలను సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చెయ్యబోతున్నాడు చిరు.ఇక అటు పవన్ కూడా భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

వీరి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.మరి ఈ ఇద్దరి హీరోలను అనిల్ ఒప్పిస్తాడో లేదో చూస్తుండాలి.

#AnilRavipudi #Pawan Kalyan #Anil Ravipudi #Chiranjeevi #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube