రామ్ ని చూస్తే రణవీర్ సింగ్ లా కనిపిస్తాడు అంటున్న అనిల్ రావిపూడి

టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ పోతినేని.తక్కువ సమయంలోనే భాగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ కెరియర్ పరంగా స్టార్ హీరోల రేంజ్ అందుకోలేకపోయిన అతని ఇమేజ్ ని మాత్రం ఎలాంటి ఢోకా లేదు.

 Director Anil Ravipudi Compare Ram Energy Levels Same Like Ranveer-TeluguStop.com

ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొద్దిగా కమర్షియల్ హీరో ఎలివేషన్ సినిమాల వైపు, వేరియేషన్ ఉన్న కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.గతంలో అన్ని కూడా ఒకే తరహాలో ఉండే కథలు చేయడం వలన సక్సెస్ రేట్ అతనికి తక్కువగా ఉంది.

ఇస్మార్ట్ శంకర్ తో తనలోని ఎనర్జీ లెవల్స్ అన్ని బయటకి తీసుకొచ్చి పక్కా మాస్ హీరోగా మారిపోయాడు.ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో పక్కా మాస్ మసాలా మూవీ రామ్ చేయబోతున్నాడు.

 Director Anil Ravipudi Compare Ram Energy Levels Same Like Ranveer-రామ్ ని చూస్తే రణవీర్ సింగ్ లా కనిపిస్తాడు అంటున్న అనిల్ రావిపూడి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే సౌత్ లో రామ్ లా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ చేసే యంగ్ హీరోలు చాలా తక్కువని చెప్పాలి.

ఈ కారణంగానే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రామ్ ని ఏకంగా బాలీవుడ్ యంగ్ స్టార్ రణవీర్ సింగ్ తో పోల్చేశాడు.

గాలి సంపత్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రామ్ హాజరయ్యాడు.ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ చూసిన తర్వాత రామ్ టాలీవుడ్ రణ్వీర్ సింగ్ లా కనిపించినట్లు అనిల్ చెప్పుకొచ్చాడు.

ఎందుకంటే ఆ సినిమాలో రామ్ ఎనర్జీ లెవల్స్ ఆ రేంజిలో ఉంటాయని చెప్పాడు.మరి రామ్ ఎనర్జీ లెవల్స్ ఉపయోగించుకొని అనిల్ రావిపూడి అతనికి సాలిడ్ సక్సెస్ ఇస్తే చూడాలని రామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా షూటింగ్ లో ఉన్నాడు.ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలకృష్ణలతో సినిమాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకున్నాడు.

#Gali Sampath #Ranveer #DirectorAnil #Ram Pothineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు