ఆర్ ఎక్స్ 100 దర్శకుడి నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీ! మరో హీరోగా నిర్మాత కొడుకు!

ఆర్ఎక్స్ 100 చిత్రం తో టాలీవుడ్ లో దర్శకుడుగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి.ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమా నితిన్ తో చేస్తాడని అందరూ భావించిన ఊహించిన విధంగా క్రేజీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు.

 Director Ajay Bhupathi Next Multistarrer Movie Second Hero Fix-TeluguStop.com

వరుస ఫ్లాపులతో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఏ మాత్రం తగ్గకుండా సీనియర్ దర్శకులతో పాటు కొత్త దర్శకులు కూడా అవకాశం ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత అనే సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది.

తన నెక్స్ట్ సినిమాని దర్శకుడు అజయ్ భూపతి తో బెల్లంకొండ ప్లాన్ చేసుకున్నాడు.

ఇదో కమర్షియల్ థ్రిల్లర్ కథతో నడిచే సినిమా అని తెలుస్తోంది.దీంట్లో ఇద్దరు హీరోలు ఉంటారని ముందే ఫిక్స్ చేసిన దర్శకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు మరో హీరోని తాజాగా ఫైనల్ చేశాడు.

పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న నిర్మాత రాజు తనయుడు శివ ఇప్పటికే హీరోగా తెరంగేట్రం చేశారు.ఆ సినిమా సెట్స్పై ఉండగానే ఇప్పుడు అదే అజయ్ భూపతి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని తెలుస్తుంది.

సెకండ్ సినిమాని మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్న ఈ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు టాలీవుడ్ లో రెండో చిత్రం విగ్నం ఎంతవరకు అధిగమిస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube