ఆర్‌ఎక్స్‌100 దర్శకుడు ప్రభాస్‌కు బంధువు.. ఎలాగో తెలుసా     2018-07-23   10:51:19  IST  Ramesh Palla

ఈమద్య కాలంలో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలను సైతం పక్కకు నెట్టి ఈ చిత్రం భారీ విజయం సాధించింది. రెండవ వారంలో కూడా కలెక్షన్స్‌ జోరు కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ యూత్‌ డైరెక్టర్‌ అయ్యాడు. ఎప్పటి నుండో సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న అజయ్‌ ఎట్టకేకు స్టార్‌ అయ్యాడు. ఈయనతో సినిమాలు చేసేందుకు పలువురు యంగ్‌ హీరోలు ఆసక్తిగా ఉన్నారు.

అజయ్‌ మొదట రామ్‌ గోపాల్‌ వర్మ వద్ద శిష్యుడిగా చేశాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలకు అజయ్‌ పని చేశాడు. తాజాగా వర్మ ఆర్‌ఎక్స్‌ 100 విడుదల నేపథ్యంలో అజయ్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో వర్మ మాట్లాడుతూ ప్రభాస్‌తో అజయ్‌కు చుట్టరికం ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. అయితే వర్మ మాటల్లో అర్థంను ప్రేక్షకులు తెలుసుకోలేక పోయారు. తాజాగా అజయ్‌ భూపతి స్వయంగా తనకు ప్రభాస్‌తో బంధుత్వం ఉందని, అయితే ఇప్పటి వరకు ప్రభాస్‌ను కాని, కృష్ణంరాజు గారిని కాని కలుసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దూరపు చుట్టరికం ఇద్దరి మద్య ఉందని చెప్పిన అజయ్‌ ఆ దిశగా తాను ఎప్పుడు సినిమాల్లో ఛాన్స్‌లకు ప్రయత్నాలు చేయలేదు అని చెప్పుకొచ్చాడు.

-

ప్రభాస్‌తో రిలేషన్‌ గురించి అజయ్‌ మాట్లాడుతూ.. తన కజిన్‌ వైఫ్‌ ప్రభాస్‌ ఫ్యామిలీలో ఒకరు అని, అలా తనకు ప్రభాస్‌ బంధువు అవుతాడని, ఎప్పుడు కూడా ప్రభాస్‌ను కలిసే సందర్బం రాలేదు. త్వరలోనే కజిన్‌ ద్వారా ప్రభాస్‌ను కలవాలని భావిస్తున్నాను అంటున్నాడు. అయితే ప్రభాస్‌తో సినిమా ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, కేవలం సినిమా ప్రమోషన్‌ కోసం కలవాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తన తదుపరి చిత్రం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు అంటూ దర్శకుడు అజయ్‌ చెప్పుకొచ్చాడు.

ఈయనకు ఇప్పటికే స్రవంతి రవికిషోర్‌ మరియు నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డిు అడ్వాన్స్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. రెండవ సినిమా స్క్రిప్ట్‌కు సమయం పడుతుందని, ఇప్పట్లో తన రెండవ సినిమా గురించి చెప్పలేను అంటూ మరో ఇంటర్వ్యూలో అజయ్‌ పేర్కొన్నాడు. భవిష్యత్తులో ప్రభాస్‌కు అజయ్‌ బంధువు కనుక తప్పకుండా పాజిటివ్‌ రెస్పాన్స్‌ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.