భర్త కొడితే తిరిగి కొట్టలేరా? వెంటనే విడాకులా?

ఇటీవలే హీరోయిన్ తాప్సి థప్పడ్ అనే చిత్రంలో గృహిణి పాత్రలో నటించారు.అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంత చేసుకుంది.

 Director Ahmed Khan Says Thappad Concept Is Strange-TeluguStop.com

అయితే ఈ సినిమాలో తాప్సి గృహిణి పాత్రలో నటించింది.అప్పటి వరుకు సంతోషంగా ఉన్న భార్యను పని వత్తిడిలో ఒక్క చెంప దెబ్బ కొడుతాడు.

దీంతో ఆమెకు విడాకులు కావాలి అని కోర్టు మెట్లు ఎక్కుతుంది.ఆ కారణం విన్న కోర్టు కూడా షాక్ అవుతుంది.

ఆతరవాత సినిమా ఏంటి అన్నదే కథ.

అయితే ఈ సినిమాను చుసిన అహ్మద్ ఖాన్ ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.” అసలు సినిమా కథ ఏంటో అర్ధమే కాలేదు.భర్త టెన్షన్ లో ఒక్క చెంప దెబ్బ కొట్టగానే ఆమె అతన్ని వదిలేసి వెళ్తుందా? విచిత్రంగా ఉంది.భర్త కొట్టిన వెంటనే ఆమె కూడా వెనక్కి తిరిగి రెండు కొట్టచ్చు కదా.!

ఒకవేళ నేను నా భార్యను కొడితే ఆమె నన్ను కూడా కొట్టి గొడవను అక్కడితో ఆపొచ్చు.ఒకవేళ నాకు నీతో ఉండాలని లేదు అని నేను నా భార్యకు చెప్తే ఆమె కూడా అదే నాకు చెప్పొచ్చు.కానీ ఒక్క చెంప దెబ్బ భార్యాభర్త కలిసి ఉండాలా లేదా అన్నది నిర్ణయించలేదు కదా.అయితే ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయనుకోండి” అంటూ సెటైర్ వేస్తూనే కామెంట్ చేశాడు అహ్మద్ ఖాన్.దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube