Director Aadurti Subbarao: ఆ తపన లేకపోతే ఎంత తోమినా ఫలితం ఉండదు.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్!

సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు సినిమాకు ముందు పలు సినిమాలలో నటించినా హీరోగా నటించిన తొలి సినిమా మాత్రం తేనె మనసులు అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు.

 Director Aadurti Subbarao Shocking Comments Details, Aadurti Subbarao, Krishna,-TeluguStop.com

తేన మనసులు షూట్ పూర్తైన తర్వాత ఆదుర్తి సుబ్బారావు పాత్రికేయులతో మాట్లాడుతూ తేనె మనసులు మూవీని అంతా కొత్తవారితో తీశానని పాత్రికేయుల సపోర్ట్ ఉండాలని కామెంట్ చేశారు.

ఆ తర్వాత సి.వి.రెడ్డి ఆదుర్తి సుబ్బారావుతో ఎవరైనా కొత్తవాళ్లు మీకు ఎదురుపడి ఆ వ్యక్తి సినిమాలకు పనికి వస్తాడని మీకు అనిపిస్తే సినిమాల్లో పరిచయం చేస్తారా? అని అడగగా ఆ ప్రశ్నకు ఆదుర్తి సుబ్బారావు బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను సినిమాలలో పరిచయం చేయాలని అనుకునే వ్యక్తి ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోదని అతనిలో నటించాలనే తపన ఉండాలని ఆదుర్తి సుబ్బారావు చెప్పుకొచ్చారు.

ఆ తపన లేకపోతే అలాంటి వ్యక్తులను ఎంత తోమినా ఎలాంటి ఫలితం ఉండదని ఆదుర్తి సుబ్బారావు వెల్లడించారు.

Telugu Vishwanath, Krishna, Thene Manasulu, Tollywood-Movie

తేనె మనసులు సినిమాను తీసుకుంటే ఈ సినిమా అడిషన్స్ కోసం ఎంతోమంది కొత్తవాళ్లు వచ్చారని వాళ్లలో కేవలం నలుగురిని మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని కామెంట్లు చేశారు.ఈ సినిమాలో నా అంచనాలకు తగ్గకుండా వీళ్లు నటించారని ఆయన పేర్కొన్నారు.

Telugu Vishwanath, Krishna, Thene Manasulu, Tollywood-Movie

ఈ సినిమా సక్సెస్ సాధించి కృష్ణ కెరీర్ ను మలుపు తిప్పింది.సినిమాల్లో హీరోగా సక్సెస్ సాధించాలన్న హీరో కృష్ణ కోరిక ఈ సినిమాతో నెరవేరింది.ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కృష్ణ కెరీర్ ను కొనసాగించారు.

కలెక్షన్ల విషయంలో కృష్ణ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు.తేనె మనసులు సినిమాకు కె.విశ్వనాథ్ అసోసియేట్ డైరెక్టర్ గా పని చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube