కొరటాలకి ఓ డౌట్ : ఈ నగరానికి ఏమైంది..?  

Directior Koratala Siva Twit On Telangana Elections-twit Elections Hyderabad Poling Voters Vote Medak Tow Greater Sensational Comnets

మనం సినిమా హాలులోకి వెళ్తే సినిమాకంటే ముందుగా స్క్రీన్ మీద ప్రత్యక్షం అయ్యే ప్రకటన… ఈ నగరానికి ఏమైంది …? ఇప్పడు అదే ప్రశ్న వేస్తున్నాడు ఓ సినిమా డైరెక్టర్. కాకపోతే … ఈ నగరానికి ఏమైంది అని కాకుండా ఈ హైదరాబాద్ కి ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. అంతే కాదు నగర ఓటరు సిగ్గుపడాలంటూ… అయన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ కొరటాలకి అంత కోపం ఎందుకు వచ్చింది అంటే.?.

కొరటాలకి ఓ డౌట్ : ఈ నగరానికి ఏమైంది..? -Directior Koratala Siva Twit On Telangana Elections

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా… సాయంత్రం 3గంటల సమయంలో హైదరాబాద్‌లో కేవలం 35 శాతమే పోలింగ్‌ నమోదవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ ట్వీట్‌ పెట్టారు.

‘హైదరాబాద్‌కు ఏమవుతోంది? 3 గంటల సమయంలోనూ ఇంకా 35 శాతమే పోలైందా? నగర ఓటర్లు సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56.17 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా మెదక్‌ నియోజకవర్గంలో 75.75శాతం పోలింగ్‌ నమోదు కాగా, యాకుత్‌పురాలో అత్యల్పంగా 32శాతం నమోదయ్యింది.